రోజూ సలాడ్ తింటూంటే శరీరంలో జరిగే మార్పులివే..!

ABN, Publish Date - Sep 09 , 2024 | 01:15 PM

y ఆరోగ్యకరమైన ఆహారాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్.. ఇలా అన్నీ సమృద్దిగా ఉంటాయి. అలా ఆరోగ్యకరమైన ఆహారాలలో ఈ మధ్య కాలంలో సలాడ్ చాలా క్రేజ్ సంపాదించుకుంది. రోజూ సలాడ్ తింటూంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

రోజూ  సలాడ్ తింటూంటే శరీరంలో జరిగే మార్పులివే..! 1/8

ఆరోగ్యకరమైన ఆహారాలలో ఈ మధ్య కాలంలో సలాడ్ చాలా క్రేజ్ సంపాదించుకుంది. రోజూ సలాడ్ తింటూంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

రోజూ  సలాడ్ తింటూంటే శరీరంలో జరిగే మార్పులివే..! 2/8

సలాడ్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కడుపు నింపడంలో ఇవి బాగా సహాయపడతాయి. బరువు తగ్గాలని అనుకునేవారు సలాడ్ తింటే మంచిది.

రోజూ  సలాడ్ తింటూంటే శరీరంలో జరిగే మార్పులివే..! 3/8

సలాడ్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది.

రోజూ  సలాడ్ తింటూంటే శరీరంలో జరిగే మార్పులివే..! 4/8

సలాడ్ లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

రోజూ  సలాడ్ తింటూంటే శరీరంలో జరిగే మార్పులివే..! 5/8

సలాడ్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దోసకాయ, టమోటా వంటి కూరగాయలలో నీటి శాతం ఎక్కువ. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.

రోజూ  సలాడ్ తింటూంటే శరీరంలో జరిగే మార్పులివే..! 6/8

సలాడ్ లలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి.

రోజూ  సలాడ్ తింటూంటే శరీరంలో జరిగే మార్పులివే..! 7/8

సలాడ్ లో ఆకుకూరలు, పనీర్, గుడ్లు వంటివి కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి.

రోజూ  సలాడ్ తింటూంటే శరీరంలో జరిగే మార్పులివే..! 8/8

సలాడ్ లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. మలబద్దకం నుండి ఉపశమనం ఇస్తుంది.

Updated at - Sep 09 , 2024 | 01:15 PM