Male Mosquitoes: మగ దోమలు మనుషులను ఎందుకు కుట్టవు..
ABN, Publish Date - Mar 21 , 2025 | 08:44 PM
Why Male Mosquitoes Dont Bite : దోమలు కుట్టడం ద్వారానే మలేరియా, డెంగ్యూ లాంటి ప్రాణాంతక వైరల్ ఫీవర్లు వస్తాయి. కానీ, మనల్ని కరిచే దోమలన్నీ ఆడ దోమలే. మగ దోమలు అసలు మనుషులను కుట్టనే కుట్టవు. అసలు రహస్యమిదే..

రాత్రవగానే దోమలు దూరని ఇళ్లు అతి తక్కువ. పడుకునే సమయంలో నిద్రపోనివ్వకుండా ఎంతగానో ఇబ్బంది పెడతాయి.

దోమకాటు అనేక ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. ఈ వ్యాధులలో డెంగ్యూ, మలేరియా వంటి అనేక వ్యాధులు ఉన్నాయి.

కానీ మగ దోమలు ఎక్కువగా మనుషులను కుట్టవని మీకు తెలుసా? ఎందుకంటే ఆడ దోమల్లాగా మానవ రక్తంపై ఆధారపడి బతకవు.

దాదాపు అన్ని మగ దోమలు మొక్కల రసం నుండి ఆహారాన్ని స్వీకరిస్తాయి. తీపి పదార్థాలపై ఎక్కువగా ఆధారపడతాయి. అదే ఆడదోమలైతే చెట్లపైన గుడ్లు పెడతాయి.

ఆడ దోమ సంతతిని పెంచుకునేందుకే మనుషులను కుడుతుంది. మానవ రక్తంలోని ప్రోటీన్ దోమల సంతానోత్పత్తికి తోడ్పడతాయి.

ఆడ దోమలు మగ దోమల కంటే రెండు వారాలు ఎక్కువ కాలం జీవిస్తాయి. ఆడ దోమలు చనిపోయే ముందు వదిలే లార్వాలు వేల దోమలను సృష్టిస్తాయి.
Updated at - Mar 21 , 2025 | 08:45 PM