కుటుంబసమేతంగా తిరుమలకు చంద్రబాబు..
ABN, Publish Date - Mar 21 , 2025 | 11:13 AM
సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చంద్రబాబు కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని. ప్రత్యేక పూజలు చేశారు.

స్వామివారి దర్శనార్ధం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి వెళ్ళారు.

సంప్రదాయ వస్త్ర ధారణతో శ్రీవారి దర్శనానికి వచ్చారు.

ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చంద్రబాబు కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యలతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు.

ప్రసాదాల పంపిణీకి ఒకరోజు అయ్యే ఖర్చును దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు చంద్రబాబు విరాళంగా అందజేశారు.
Updated at - Mar 21 , 2025 | 11:13 AM