Share News

Viral: గుండు చేయించుకునేది ఇలాగా? నెటిజన్లను షేక్ చేస్తున్న వీడియో!

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:33 PM

ఓ బార్బర్ పారతో కస్టమర్‌కు క్షవరం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది నిజమో కాదో తెలీక కొందరు నెత్తిబాదుకుంటే మరికొందరు ఐడియా వింతగా ఉందంటూ పడీపడీ నవ్వుకున్నారు.

Viral: గుండు చేయించుకునేది ఇలాగా? నెటిజన్లను షేక్ చేస్తున్న వీడియో!
Barber shaves head with shovel

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట వీడియో వైరల్ అయ్యిందంటే ఏదో విశేషం ఉందనే భావించాలి. వీడియో తమకు నచ్చిందంటే చాలు జనాలు..అది నిజమా ఫేక్ వీడియోనా అన్న తేడాల్లేకుండా తెగ షేర్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉండేలా చేస్తారు. కామెంట్లు, లైకులతో హోరెత్తిస్తుంటారు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. బార్బర్ షాపులో ఓ వ్యక్తి గుండు చేయించుకుంటున్న వీడియో (Viral) ఇది. ఇలాంటి వీడియోను ఎన్నడూ చూడని జనాలు నోరెళ్లబెడుతున్నారు.

Viral: ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.60 వేల చోరీ.. 20 రోజుల్లో తిరిగిచ్చేస్తానంటూ హామీ!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ బార్బర్ యువకుడికి గుండు చేసేందుకు ఏకంగా పార వాడాడు. బార్బర్ పార వాడి తన పని చేస్తుంటే యువకుడు అదేదో సాధారణ విషయమైనట్టు బుద్ధిగా కూర్చున్నాడు. ట్రిమ్మర్, బ్లేడ్ వంటివేమీ వాడకుండా కేవలం పారతో జుట్టు తొలగించేశాడు. అయితే, ఈ ప్రయోగం ఆశించిన ఫలితం మాత్రం ఇవ్వలేదని వీడియో చూస్తే అర్థమైపోతుంది. యువకుడి నెత్తిపై చాలా చోట్ల జుట్టు మిగిలిపోయినట్టు వీడియోలో కనిపించింది (Barber Uses This Unconventional Tool To Cut Customers Hair).

ఇక వీడియో జనాలను ఎంతగా ఎంటర్‌టైన్ చేస్తోందంటే..ఇప్పటివరకూ దీనికి దాదాపు నాలుగు కోట్ల వరకూ వ్యూస్ వచ్చాయి. ఇక కామెంట్ సెక్షన్‌లో కూడా కోకొల్లలుగా జనాలు వ్యాఖ్యలు చేశారు. పారతో ఏం ఖర్మ.. ఏకంగా జేసీబీతో చేస్తే సరిపోయి ఉండేదిగా అంటూ ఓ వ్యక్తి సెటైర్ పేల్చాడు. ఇదేం డ్రామా దేవుడా అని ఇంకో వ్యక్తి వ్యాఖ్యానించాడు. బార్బర్, కస్టమర్ ఇద్దరూ ఏదైనా కొత్త తరహా ఇంజినీరింగ్ చేసుంటారేమో అని మరో వ్యక్తి జోక్ వేశాడు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.


మరో వీడియోలో కూడా ఓ బార్బర్ తన కస్టమర్‌‌కు ఏకంగా పారతో గుండు గీసే ప్రయత్నం చేశాడు. అయితే, అప్పటికి కస్టమర్ నెత్తిమీద అసలు జుట్టు అనేదే లేదు. దీంతో, నెటిజన్లను రకరకాల సందేహాలు వ్యక్తం చేశారు. ముందుగా సాధారణ ట్రిమ్మర్‌తో జుట్టు మొత్తం తొలగించి ఆ తరువాత పార నెత్తిపై పెట్టి కెమెరాకు పోజులిచ్చి ఉంటారని అన్నారు.

మరో కటింగ్ వీడియో ఇలాగే జనాలు ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ వీడియోలో బార్బర్ ఏకంగా కస్టమర్ జుట్టుకు నిప్పు పెట్టి మరీ కటింగ్ చేశాడు. ఆ సీన్ చూసిన జనాలు.. కస్టమర్ ఎలా భరించాడో, ఆ ప్రయోగం నుంచి క్షేమంగా బయటపడ్డాడో లేదో అంటూ కామెంట్స్ పెట్టారు.

Updated Date - Jul 30 , 2024 | 03:35 PM