Share News

Viral: ట్రాఫిక్‌లో యువతిని అదేపనిగా ఫాలో అయిన ఆటోవాలా.. ఆమె స్కూటీ ఆగిపోగానే ఊహించని విధంగా..

ABN , Publish Date - Mar 16 , 2024 | 08:38 PM

సోషల్ మీడియా వచ్చాక ఎక్కడెక్కడ ఘటనలైనా సరే క్షణాల్లో అందరికీ తెలిసిపోతున్నాయి. ఇక స్ఫూర్తి కలిగించే ఆశావాహ కథనాలైతే క్షణాల్లో నెట్టింట వైరల్ అయిపోతున్నాయి. అలాంటి ఓ కథనం ప్రస్తుతం నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది.

Viral: ట్రాఫిక్‌లో యువతిని అదేపనిగా ఫాలో అయిన ఆటోవాలా.. ఆమె స్కూటీ ఆగిపోగానే ఊహించని విధంగా..

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా వచ్చాక ఎక్కడెక్కడ ఘటనలైనా సరే క్షణాల్లో అందరికీ తెలిసిపోతున్నాయి. ఇక స్ఫూర్తి కలిగించే ఆశావాహ కథనాలైతే క్షణాల్లో నెట్టింట వైరల్ (Viral) అయిపోతున్నాయి. అలాంటి ఓ కథనం ప్రస్తుతం నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది. ప్రముఖ చర్చావేదిక రెడిట్‌లో ఓ యువతి పోస్ట్ చేసిన కథనం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ కథలో హీరో అయిన ఆటో డ్రైవర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది (Autodrivers selfless Aid).

paperbackdream_ పేరిట ఉన్న అకౌంట్‌తో యువతి జరిగిన ఉదంతం గురించి చెప్పుకొచ్చింది. ఇటీవల ఆమె బెంగళూరులోని (Bengaluru) ఓల్డ్ మద్రాస్ నుంచి ఇందిరానగర్‌ వైపు స్కూటీపై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. తొలి నుంచి ట్రబులిస్తూ వచ్చిన స్కూటీ గోపాలన్ మాల్ వద్ద అకస్మాత్తుగా ఆగిపోయింది. దాన్ని స్టార్ట్ చేసేందుకు ఆమె ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఆమె ఇబ్బందిని గమనించిన ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కూడా బండిని స్టార్ చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో, వారు అటుగా వెళుతున్న ఓ ఆటోడ్రైవర్‌ను ఆపారు.

Viral: నేను చేసిన తప్పు మీరు చేయొద్దంటూ విన్నపం.. రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డరిచ్చి ఇతడు చేసిన తప్పు ఏంటంటే..


అతడు బండిని పరిశీలించి సమస్య ఏంటో ఠక్కున చెప్పేశాడు. ఫుల్‌గా పెట్రోల్ కొట్టించారని, లోపలికి గాలి పోయిందని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత కాసేపటికి అతడు బండిని స్టార్ చేయగలిగాడు. దీంతో, ఆ ముగ్గురికీ థాంక్స్ చెప్పి యువతి ముందుకు కదిలింది.

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..

అయితే, ఆటోడ్రైవర్ కూడా ఆమె వెళుతున్న మార్గంలోనే బయలుదేరాడు. చాలా సేపు ఆమెనే అనుసరించాడు. ఈ క్రమంలో యువతి స్కూటీ మళ్లీ ట్రబులిచ్చింది. దీంతో, ఆ ఆటోడ్రైవర్ మళ్లీ ఆమె వద్దకు వచ్చి యువతి అడగకపోయినా బండి స్టార్ట్ చేసేందుకు ట్రై చేశాడు. ఫలితం లేకపోవడంతో మెకానిక్‌ కోసం వెళ్లారు. ఈలోపు అక్కడే ఉన్న కొందరికి సమస్య అర్థమై యువతికి సాయపడ్డారు. వీధివ్యాపారి ఒకరు వచ్చి యువతి స్కూటీ పెట్రోల్ ట్యాంక్ తెరిచి కిక్ కొట్టడం ప్రారంభించారు. ఇలా ఓ 15 నిమిషాలు ప్రయత్నించడంతో చివరకు ఆమె బైక్ స్టార్ట్ అయ్యింది. ఈలోపు ఆటోడ్రైవర్ కూడా మెకానిక్‌ను వెంటబెట్టుకుని వచ్చాడు. అప్పటికే బండి స్టార్ట్ కావడంతో యువతి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పి పంపించింది.

ఇదంతా నెట్టింట షేర్ చేసిన ఆమె ఆటోడ్రైవర్‌పై ప్రశంసలు కురిపించింది. తన ఇబ్బంది తెలిసే అతడు.. తన బండి మొదటిసారి స్టార్ట్ అయినా ఫాలో అయి ఉంటాడని చెప్పుకొచ్చింది. ఈ ఉదంతం వైరల్ కావడంతో జనాలు ఆటోవాలాపై ప్రశంసలు కురిపించారు. పక్కోడి బాధ పట్టని ఈ లోకంలో ఇంకా మానవత్వం మిగిలుందనేందుకు ఇలాంటి ఘటనలే ఉదాహరణలని కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 08:46 PM