viral video: దీపావళి పండగ వేళ మామ్మా మజాకా
ABN , Publish Date - Oct 31 , 2024 | 01:52 PM
దీపావళి పండగ వేళ.. బామ్మ టపాస్లు భలేగా కాలుస్తుంది. పిట్ట గోడ మీద కూర్చుని వరుసగా టపాసుల్ కాలుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
దీపావళి పండగ వచ్చిందంటే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్దలు వరకు.. ఇంకా చెప్పాలంటే పండు ముసలి వారు వరకు అంతా ఒక్కటై పోతారు. వయస్సుతో ఏ మాత్రం సంబంధం లేకుండా అంతా టపాకాయలు కాలుస్తారు. మరికొంత మంది అయితే ఈ వయస్సులో తమకు పండగలు పబ్బాలు ఎందుకు అంటూ నిర్వేదంతో మాట్లాడుతుంటారు.
కానీ ఓ బామ్మ మాత్రం దీపావళి పండగ వేళ.. టపాకాయలు కాలుస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తుంది. అందుకు సంబంధించిన ఓ వీడియో అయితే సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ వీడియోలో బామ్మ ఓ గోడ మీద కూర్చుంది. ఒక్కొక్క టపాకాయ తీసుకుని.. వెలిగించి కిందకి విసిరేస్తుంది. అనంతరం ఆ టపాకాయ పేలుతుంది. ఇలా ఒకదాని వెంట ఒకటి టపాకాయలు కాలుస్తూ.. బామ్మ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో వివిధ రీతుల్లో స్పందిస్తున్నారు.
అంతేకాదు ఈ వీడియోను పలువురు నెటిజన్లు షేర్ సైతం చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే.. నిజమే తమ్ముడు. పటాకులు కాల్చాలంటే నాకు చాలా భయం, అమ్మ చేతిలో పట్టుకుని కాల్చేస్తుంది అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ అయితే బామ్మ గారు.. మీకు దీపావళి శుభాకాంక్షలు. ఈ పండగ వేళ.. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
మనిషి ముసలివాడయ్యాక మళ్లీ చిన్న పిల్లవాడుగా మారతాడనేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ అని ఇంకో నెటిజన్ స్పష్టం చేశాడు. ఇలా ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో వివిధ రీతుల్లో స్పందిస్తున్నారు. మరోవైపు వైరల్గా మారిన ఈ వీడియో.. ఎక్కడ, ఎప్పుడు తీశారనేది మాత్రం స్పష్టం చేయకపోవడం గమనార్హం.
For More Viral News And Telugu News..