Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నది ఒడ్డున నడుస్తున్న కుక్క.. హఠాత్తుగా నీళ్లలోంచి వచ్చిన మొసలి ఏం చేసిందంటే..

ABN , Publish Date - Aug 24 , 2024 | 10:50 AM

నీటిలోని మొసలి బలం ముందు ఏనుగు కూడా నిలవలేదు. మొసలి చాలా హఠాత్తుగా దాడి చేస్తుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మొసలి వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మొసలి వేట చూసి షాక్ అవ్వాల్సిందే.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నది ఒడ్డున నడుస్తున్న కుక్క.. హఠాత్తుగా నీళ్లలోంచి వచ్చిన మొసలి ఏం చేసిందంటే..
Crocodile hunting

మొసలి (Crocodile) ఎంత ప్రమాదకరమైన జంతువు అంటే దాని నోటికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. నీటిలోని మొసలి బలం ముందు ఏనుగు కూడా నిలవలేదు. మొసలి చాలా హఠాత్తుగా దాడి చేస్తుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మొసలి వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మొసలి వేట (Crocodile Hunting) చూసి షాక్ అవ్వాల్సిందే. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


@TheeDarkCircle అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ నదిలో (River) నీరు అత్యంత వేగంగా ప్రవహిస్తోంది. ఆ నది ఒడ్డు మీద ఓ కుక్క (Dog) నడుచుకుంటూ వెళ్తోంది. అంతలో హఠాత్తుగా నీళ్లలో నుంచి ఓ మొసలి పైకి వచ్చి ఆ కుక్కను పట్టుకుంది. వెంటనే ఆ కుక్కను నీటిలోకి లాగేసుకుని లోపలికి వెళ్లిపోయింది. అంతా సెకెన్ల వ్యవధిలో జరిగిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన జనాలు కేకలు పెట్టారు. ఈ వీడియోను రికార్డు చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.7 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 3.2 వేల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఎవరూ ఎక్కడా క్షేమం కాదు``, ``ఆ కుక్కకు ఏం జరిగిందో అర్థం కాలేదు``, ``నీరు అంత వేగంగా ప్రవహిస్తున్నా కూడా మొసలి స్థిరంగా తన పని పూర్తి చేసుకుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. కింగ్ కోబ్రా భయంకర రూపం చూస్తే నివ్వెరపోవాల్సిందే..!


Viral: ఛీ..ఛీ.. మార్చురీలో ఇదేం పని.. 75 శవాల మధ్య అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన జంట.. వీడియో తీస్తున్నా..


Viral Video: అదృష్టం బాగుంటే ఎవ్వరూ ఏం చేయలేరు.. ఆ కుర్రాడు ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడో చూడండి..!


Viral Video: పాకిస్తాన్ బోర్డర్‌లో అరుదైన దృశ్యం.. సరిహద్దు అవతలి నుంచి ఎలా మాట్లాడుకున్నారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 24 , 2024 | 10:50 AM