Share News

Viral Video: చెరువులో స్నానం చేస్తున్న స్నేహితులు.. సడెన్‌గా మొసలి రావడంతో.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

ABN , Publish Date - Jul 19 , 2024 | 02:24 PM

చెరువుల్లోని, నదుల్లోని స్నానం చేయడం చాలా సరదాగా ఉంటుంది కానీ, అప్పుడప్పుడు అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. పాములు, మొసళ్లు వంటి భయంకర జీవులతో ప్రమాదం పొంచి ఉంటుంది. మొసలిని దూరం నుంచే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఎదురుగా వస్తే ఎలా ఉంటుంది.

Viral Video: చెరువులో స్నానం చేస్తున్న స్నేహితులు.. సడెన్‌గా మొసలి రావడంతో.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!
Funny Crocodile Prank Viral Video

చెరువుల్లోని, నదుల్లోని స్నానం (Bathing) చేయడం చాలా సరదాగా ఉంటుంది కానీ, అప్పుడప్పుడు అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. పాములు, మొసళ్లు (Crocodile) వంటి భయంకర జీవులతో ప్రమాదం పొంచి ఉంటుంది. మొసలిని దూరం నుంచే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఎదురుగా వస్తే ఎలా ఉంటుంది. ఓ వ్యక్తి తన స్నేహితులకు సరదాగా అలాంటి అనుభవాన్ని రుచి చూపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది (Viral Video).


m1yd అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు చెరువులోకి దిగి స్నానం చేస్తున్నారు. ఒడ్డున ఉన్న స్నేహితుడు వీడియో తీస్తుంటే అటు వైపు చూస్తున్నారు. అంతలో వారి వెనుక నుంచి ఓ మొసలి వచ్చింది. వారి ముందుకు వచ్చింది. ఆ మొసలిని చూసిన ఆ ఇద్దరూ అదిరిపడ్డారు. కిందా మీదా పడుతూ ఒడ్డుకు పరిగెత్తేందుకు ప్రయత్నించారు. చివరకు అది బొమ్మ మొసలి అని, స్నేహితుడు ఫ్రాంక్ చేశాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.


ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో 18 కోట్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు. కోటి కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``నవ్వి, నవ్వి కన్నీళ్లు వస్తున్నాయి``, ``బహుశా నా మొత్తం జీవితంలో ఎప్పుడూ ఇంతగా నవ్వలేదు``, ``బలహీనులైతే గుండె ఆగిపోయి చనిపోతారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: మన దేశంలోనే ఇలాంటివి సాధ్యం.. రైలును ఎలా మార్చారో చూడండి.. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే..


Viral Video: వామ్మో.. ఈ బండిని రాత్రి చూస్తే దడుసుకోవాల్సిందే..! సిగరెట్ బండిని ఎలా డిజైన్ చేశారో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 19 , 2024 | 02:24 PM