Gautam Adani: నీ ముందు ఈ సంపదంతా దిగదుడుపే.. మనవరాలి ఫొటో షేర్ చేసిన గౌతమ్ అదానీ
ABN , Publish Date - Apr 02 , 2024 | 06:46 PM
నిత్యం బిజీగా ఉండే పారిశ్రామికవేత్త, అపరకుబేరుడు గౌతమ్ అదానీ తాజాగా తన మనవరాలు కావేరి ఫొటో నెట్టింట పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నిత్యం బిజీగా ఉండే పారిశ్రామికవేత్త, అపరకుబేరుడు గౌతమ్ అదానీ (Gautam Adani) తాజాగా తన మనవరాలు కావేరి (Grand Daughter Kaveri) ఫొటో నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా (Viral) మారింది. తన మనవరాలిని చూస్తే ఎంతటి ఒత్తిడైనా క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ‘‘నీ కళ్లల్లో వెలుగుల ముందు ప్రపంచంలోని సంపదంతా వెలవెలబోయే’’ అని ఆయన రాసుకొచ్చారు. గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ, ఆయన భార్య పరిధి కూతురే కావేరి. గౌతమ్ అదానీ మనవలు, మనవరాళ్లల్లో ఈ చిన్నారే అతిపిన్న వయస్కురాలు.
Viral: ఈ పెద్దాయనను చూడండి! వీధుల్లో ట్రాఫిక్ పోలీసులు ఎదురుపడితే.
గౌతమ్ అదానీ ఇటీవల తన కుటుంబంతో సహా లండన్ మ్యూజియంను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీని తిలకించారు. ఈ సందర్భంగా తన మనవరాలితో దిగిన ఫొటోను ఆయన షేర్ చేశారు. తన మనవరాళ్లతో కలిసి ఆడుతుంటే ఎంతటి ఒత్తిడైనా క్షణాల్లో మాయమైపోతుందని అన్నారు. తనకు తెలిసింది పని, కుటుంబం మాత్రమేనని చెప్పారు. కుటుంబం తన శక్తి అని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.
Viral: కూతురు లండన్ నుంచి విదేశీ ప్రియుణ్ణి ఇంటికి తీసుకొస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి