Share News

Viral Video: గూగుల్ స్ట్రీట్ కెమెరాలో చిక్కిన దెయ్యం?

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:10 PM

మీకెప్పుడైనా దెయ్యాలు(Ghosts) కనిపించాయా లేదా అయితే ఈ వీడియో చూడాల్సిందే. ఏందుకంటే ఓ మహిళ ఇటివల ఓ శ్మాశాన వాటిక పరిధిలోని సీసీ కెమెరాలో రికార్డైన దెయ్యం వీడియోను పంచుకున్నారు.

Viral Video: గూగుల్ స్ట్రీట్ కెమెరాలో చిక్కిన దెయ్యం?

మీకెప్పుడైనా దెయ్యాలు(Ghosts) కనిపించాయా లేదా అయితే ఈ వీడియో చూడాల్సిందే. ఏందుకంటే ఓ మహిళ ఇటివల ఓ శ్మాశాన వాటిక పరిధిలోని సీసీ కెమెరాలో రికార్డైన దెయ్యం వీడియోను పంచుకున్నారు. వీడియోలో ఆమెకు దెయ్యాలు కనిపించాయని..తాను అవి ఉన్నాయని నమ్ముతున్నట్లు చెప్పింది. ఈ సంఘటన యూఎస్‌(USA)లోని న్యూ హాంప్‌షైర్ పట్టణంలోని నషువా ప్రాంతంలో చోటుచేసుకోగా..అమీ పెండిల్‌టన్ అనే మహిళ గూగుల్ స్ట్రీట్ వ్యూలో రికార్డైన వీడియోను ఈ మేరకు సోషల్ మీడియాలో పంచుకున్నారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: ఊడిన విమానం కిటికీ..తర్వాత ఏమైందంటే


అయితే ఈ వీడియో చూసిన కొంత మంది దెయ్యాలు ఉన్నాయని నమ్ముతుండగా..మరికొంత మంది మాత్రం అవేమి లేవని కామెంట్లు చేస్తున్నారు. వీడియోలో రోడ్డును చూపించిన తర్వాత రాతి గోడల సెట్ వెనుక దాగి ఉన్న అస్పష్టమైన ఒక చిత్రం కనిపిస్తుంది. జూమ్ చేస్తే ఒక వ్యక్తి తల మాదిరిగా కనిపిస్తుంది. కానీ అది దెయ్యం కాదని కొంత మంది అంటున్నారు. గోడ వెనుక నిలబడి ఉన్న మరోక వ్యక్తి నీడ అని చెబుతున్నారు. మొత్తంగా ఈ వీడియోలో ఉన్నది పలువురు దెయ్యమని వాదిస్తుండగా..మరికొంత మంది మాత్రం కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వీడీయోను మీరు వీక్షించి అసలు అది దెయ్యమేనా కాదో కామెంట్(comments) చేయండి మరి.

Updated Date - Jan 06 , 2024 | 01:10 PM