Share News

Viral: ఒక రూపాయి నాణెం ముద్రించేందుకు ఎంత ఖర్చవుతుందో తెలిస్తే..

ABN , Publish Date - Nov 28 , 2024 | 07:54 PM

నాణేలు, కరెన్సీ నోట్లు ముద్రించేందుకు కొంత డబ్బు ఖర్చవుతుంది. మరి ఒక రూపాయి నాణెం ముద్రించేందుకు ఎంత డబ్బు కావాలో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే, ఈ ఆసక్తికర కథనం మీ కోసమే!

Viral: ఒక రూపాయి నాణెం ముద్రించేందుకు ఎంత ఖర్చవుతుందో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: నాణేలు, కరెన్సీ నోట్లు ముద్రించేందుకు కొంత డబ్బు ఖర్చవుతుంది. మరి ఒక రూపాయి నాణెం ముద్రించేందుకు ఎంత డబ్బు కావాలో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే, ఈ ఆసక్తికర కథనం మీ కోసమే. 2018 లో ఆర్‌టీఐ చట్టం కింద ప్రభుత్వమిచ్చిన సమాచారం ప్రకారం, ఒక రూపాయ నాణేన్ని ముద్రించేందుకు ప్రభుత్వానికి రూ.1.11 ఖర్చవుతుంది. అంటే నాణెం విలువకంటే ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నమాట (Viral).

Viral: యువతులతో కలిసి ఏనుగు భరతనాట్యం! జరిగింది తెలిస్తే కన్నీళ్లు ఆగవ్!


కరెన్సీ ముద్రణ ఎక్కడంటే..

కరెన్సీ బాధ్యత ప్రభుత్వంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కూడా ఉంది. ఒక రూపాయి నోటుతో పాటు అన్ని కరెన్సీ నాణేలను భారత ప్రభుత్వమే ముద్రిస్తుంది. ఇక రూ.2 నుంచి రూ.500 నోటు వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది. ఒకప్పుడు ఆర్బీఐ రూ.2000 నోటు కూడా ముద్రించినప్పటికీ ఆ తరువాత ఈ నోటును ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం ఇది వినియోగంలో లేకుండా పోయింది.

ఇక రూ.1 నాణేన్ని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేస్తారు. ఈ నాణెం డయామీటర్ 21.93 మిల్లీమీటర్లు. ఇది 1.45 మిల్లీమీటర్ల మందం ఉండేలా ముద్రిస్తారు. బరువు 3.76 గ్రాములు. మరోవైపు, రూ.2 నాణెం ముద్రించేందుకు రూ.1.28, రూ.5 నాణెం ముద్రించేందుకు రూ.3.69, రూ.10 నాణెం ముద్రించేందుకు రూ.5.54 ఖర్చవుతాయని ప్రభుత్వం పేర్కొంది.

Viral: నాణ్యతాలోపాలున్న వస్తువుల డెలివరీ.. ఫ్లిప్‌కార్ట్‌కు భారీ షాక్!


నాణేలను ముద్రించేందుకు దేశంలో పలు మింట్స్ ఉన్నాయి. ముద్రణ ఖర్చులను హైదరాబాద్ మింట్ వెల్లడించినప్పటికీ ముంబై ముద్రణాలయం మాత్రం గోప్యతా కారణాల రీత్యా ఈ వివరాలను వెల్లడించేందుకు నిరాకరించింది.

ఇక రూ.2 వేల నోటును ముద్రించేందుకు ప్రభుత్వానికి రూ.4 ఖర్చయ్యేదట. ప్రభుత్వ లెక్కల ప్రకారం, వెయ్యి రూ.10ల నోట్లు ముద్రించేందుకు రూ.960, వెయ్యి రూ.100ల నోట్లు ముద్రించేందుకు రూ.1770, వెయ్యి రూ.200ల నోట్లు ముద్రించేందుకు రూ.2370, వెయ్యి రూ.500ల నోట్లు ముద్రించేందుకు రూ.2290 అవుతుంది. భారత్‌లో నాలుగు కరెన్సీ నోట్లు ముద్రణాలయాలు, నాలుగు నాణేల ముద్రణాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని దేవాస్, మహారాష్ట్రలోని నాశిక్, కర్ణాటకలోని మైసూర్, పశ్చిమ బెంగాల్‌లోని సాల్బొనీలో కరెన్సీ నోట్లను ముద్రిస్తారు.

Viral: రూ.6,015 కోట్లను చెత్తలో పారేసిన గర్ల్‌ఫ్రెండ్! జరిగిందేంటో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Nov 28 , 2024 | 08:02 PM