Share News

Viral News: ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోనా? కాదా? ఇలా సులువుగా గుర్తించండి

ABN , Publish Date - Dec 03 , 2024 | 06:23 PM

ప్రస్తుతం అంతా ఏఐ .. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతే నడుస్తుంది. అసలు ఫోటో ఏదో.. సాధారణ ఫోటో ఏదో తెలియని విధంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అలాంటి వేళ.. ఏఐ, సాధారణ ఫోటోను ఇలా గుర్తించ వచ్చు. అది కూడా చాలా సులువుగా గమనించ వచ్చు.

Viral News: ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోనా? కాదా? ఇలా సులువుగా గుర్తించండి

ప్రస్తుతం అయితే ఏఐ (AI).. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది. చాలా కంపెనీలు ఏఐను ఉపయోగిస్తున్నాయి. ప్రపంచంలో ఫోటోగ్రఫీ రంగం సైతం ఏఐ సాంకేతికతో తన రూపు రేఖలను మార్చుకుంటోంది. ఇప్పుడు ఏఐని ఉపయోగించి.. ఫోటోలను రూపొందించడం చాలా సులువు అయిపోయింది. అంతేకాదు.. ఈ ఫోటోలు అసలు సిసలు నిజమైనవిగా ఉంటున్నాయి. దీంతో ఈ ఫోటో నిజమైనదా? లేక ఏఐ ద్వారా సృష్టించినదా? అనేది తెలుసుకోవడం కొన్ని సార్లు చాలా కష్ట సాధ్యంగా మారుతోంది. అయితే ఏఐ సాంకేతికతో చేసిన ఫోటోలను ఈ విధంగా గుర్తించ వచ్చు.


dog.jpg

  • కళ్ళు లేదా దంతాల వింత ఆకారాలు.. లేదా శరీర భాగాల అసాధారణ ఉండడం వంటి కొన్ని వింత అంశాలు AI సాంకేతికతో రూపొందించిన చిత్రాలలో కనిపిస్తాయి. అంతేకాకుండా వింత కాంతి లేదా నీడ సైతం అందులో గమనించవచ్చు.

  • ఫోటోను ఓ సారి పరిశీలిస్తే.. ఏఐ సాంకేతికతో రూపొందించిన చిత్రాల్లో కొంత అస్పష్టంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే.. వాస్తవ ప్రపంచంలో కనిపించని కొన్ని నమూనాలు సైతం అందులో చూడవచ్చు.


dog-rat.jpg

  • ఇక ఏఐ సాంకేతికతో రూపొందించిన ఫోటోలలో అసహజంగా పెరిగిన జుట్టు, బట్టలపై వింత ముడతలు, వేసవి ఫోటోలో మంచు లేదా జంతువు శరీరంపై పక్షి ఈకలు మొదలైన లోపాలు స్పష్టంగా గమనించ వచ్చు.

  • అలాగే ఫోటో ఏఐ ద్వారా రూపొందించ బడిందో లేదో తెలుసుకోనేందుకు.. రివర్స్ ఇమేజ్ ను సెర్చ్ చేయవచ్చు. అదే విధంగా గూగుల్ లెన్స్ ద్వారా.. ఈ ఫొటో గతంలో వినియోగించారా? లేదా కూడా తెలుసుకోవచ్చు.


  • మరోవైపు ఏఐ సాంకేతికతో రూపొందించిన చిత్రాలను గుర్తించడంలో.. సహాయపడే అనేక ఆన్ లైన సాధనాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకొని ఏదైనా ఫోటోను సైతం ఇట్టే కనిపెట్ట వచ్చు.

For prathyekam News And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 06:36 PM