Viral Video: 5 స్టార్ హోటల్ బాల్కనీలో బట్టలారేసిన భారత మహిళ
ABN , Publish Date - Jun 29 , 2024 | 12:05 PM
సాధారణంగా అమ్మలు(mothers) ప్రతి పని ఇలా చేయాలి, అలా చేయాలని సూచనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ 5 స్టార్ హోటల్‌కు వెళ్లిన క్రమంలో జరిగిన ఓ సంఘటన దృశ్యాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
సాధారణంగా అమ్మలు(mothers) ప్రతి పని ఇలా చేయాలి, అలా చేయాలని సూచనలు చేస్తుంటారు. ఏ టూర్ వెళ్లినా కూడా భోజనంతోపాటు అనేక పనులను వారే స్వయంగా చూసుకుంటారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ 5 స్టార్ హోటల్‌కు వెళ్లిన క్రమంలో జరిగిన ఓ సంఘటన దృశ్యాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ పెద్దావిడ దుబాయ్(Dubai)లోని 5 స్టార్ హోటల్(hotel) గది బాల్కనీలో బట్టలు ఆరబెట్టడం కనిపిస్తుంది.
పల్లవి వెంకటేష్ ఫ్యామిలీ హాలిడే కోసం దుబాయ్ వెళ్లిన క్రమంలో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ క్రమంలో అమ్మలు అట్లాంటిస్ వెళ్లినా కూడా వారి పనులు మాత్రం మరువలేరని పేర్కొన్నారు. ఈ వీడియో కొన్ని రోజుల్లోనే 11 మిలియన్లకు పైగా వీక్షణలను సాధించింది. దీనిపై హోటల్(hotel) యాజమాన్యం కూడా స్పందించడం విశేషం. మీ తల్లి కర్తవ్యం నిర్వహించారని, మీరు మీ బసను ఆస్వాదించారని మేము ఆశిస్తున్నామని హోటల్ యాజమాన్యం తెలిపింది. అంతేకాదు ప్రతి బాత్రూంలో బట్టలు ఆరబెట్టుకునేందుకు తాడులు కూడా ఉన్నాయని, మీరు స్నానం చేసినప్పుడు అక్కడే ఆరబెట్టుకోవచ్చని అన్నారు.
ఈ వీడియో చూసిన పలువురు అనేక విధాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో చూసిన పలువురు మహిళను విమర్శించగా, మరికొందరు మాత్రం ఆమెను సమర్థించారు. ఇతర దేశాల్లో దీనిని తప్పు ప్రవర్తనగా భావిస్తారని ఓ వ్యక్తి కామెంట్(comments) చేయగా, మరొకరు మాత్రం అలా చేస్తే తప్పేంటని అంటున్నారు. సాధారణంగా 5 స్టార్ హోటళ్లలో బట్టలను ఆయా హోటల్స్ నిబంధనల ప్రకారం బాల్కానీలో ఆరేయకుండా ఉంటారు.
ఇది కూడా చదవండి:
Viral video: చూసేందుకే పిల్లి.. దీని మంచితనం మామూలుగా లేదుగా..
Anant-Radhika Wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేళ మరో కీలక నిర్ణయం
Gold and Silver Prices: తగ్గిన బంగారం, వెండి ధరలకు బ్రేక్..ఎంత పెరిగాయంటే
For Latest News and Viral News click here