Share News

Viral: వేట అంటే ఇదీ..ఈ పక్షి టాలెంట్ పీక్స్! చూసి తీరాల్సిన వీడియో!

ABN , Publish Date - Sep 20 , 2024 | 10:04 PM

కింగ్‌ఫిషర్ పక్షి వేటకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అది క్షణకాలంలో నీళ్లల్లోకి దూకి చేపను ముక్కుతో పట్టి అంతేవేగంగా ఎగిరిపోయింది. ఈ వీడియో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Viral: వేట అంటే ఇదీ..ఈ పక్షి టాలెంట్ పీక్స్! చూసి తీరాల్సిన వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: వేట అంటే మనకు సాధారణంగా సింహాలు, పులులు లాంటి జంతువులే గుర్తొస్తాయి. కానీ, పక్షులు కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోవు. టార్గెట్ ఎంచుకున్నాక అవి దాడి చేసే తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చాకచక్యంగా వ్యూహాలు పన్ని ఆహారాన్ని దక్కించుకునే తీరు నమ్మశక్యంగా ఉండదు. ఈ కోవలో ముందుండే పక్షి డేగ. అయితే, కింగ్‌ఫిషర్ పక్షి వేట వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వేట అంటే ఇదీ అని జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది (Viral).

Viral: మరీ ఇంత క్రూరత్వమా! కుక్క పిల్లను రైలు పట్టాలకు కట్టేసి..


స్పెయిన్‌‌కు చెందిన ఓ ఫొటో గ్రాఫర్ ఈ వీడియోను రికార్డు చేశారు. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్న ఈ దృశ్యాన్ని ఫొటోగ్రాఫర్ అత్యంత చాకచక్యంగా రికార్డు చేశారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కింగ్‌ఫిషర్ పక్షి ఓ కొమ్మపై కూర్చుని కింద నీళ్లల్లో ఉన్న చేపలపై కన్నేసింది. నీరు నిశ్చలంగా ఉండటంతో లోపలున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఇక కింగ్ ఫిషర్ పక్షి సమయం కోసం ఒప్పిగా ఎదురు చూసింది. అవకాశం దొరికిందని భావించగానే ఒక్కసారిగా అమిత వేగంతో నీళ్లలోకి దూకేసింది. నీటిలో రాళ్ల మధ్య ఈదుతున్న ఓ చేపను ముక్కుతో పట్టేసింది. ఆ తరువాత అంతే వేగంగా నీళ్లల్లోంచి బయటకు వచ్చి ఎగిరిపోయింది (Kingfisher dives into creek to catch prey Youll watch spectacular moment on loop).

Viral: అత్తమామల కోసం రైల్ టిక్కెట్లు బుక్ చేసిన మహిళకు షాక్!


వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు షాకైపోతున్నారు. క్షణాల్లో వేట పూర్తైందని అన్నారు. కన్నుమూసి తెరిచేలోపే అంతా అయిపోయిందని అంటున్నారు. ఇక ఈ వీడియోను రికార్డు చేసిన వ్యక్తిపై కూడా ప్రశంసలు కురిపించారు. ఏంతో ఓపిగ్గా ఎదురుచూస్తే గానీ ఇలాంటి అద్భుత దృశ్యాలను కెమెరాలో బంధించలేమని అన్నారు. సెకెనుకు 600 ఫ్రేమ్స్‌తో ఓ వీడియోను రికార్డు చేస్తే ప్రకృతిలోని రహస్యాలను ఒడిసిపట్టొచ్చని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Sep 20 , 2024 | 10:04 PM