Share News

Viral video: జలకాలాటల్లోనూ ఇవేం పాడు పనులు.. ప్రేయసిని పైకి ఎత్తుకుని ఇతను చేసిన నిర్వాకం..

ABN , Publish Date - Jun 19 , 2024 | 08:12 PM

ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు వాహనాల్లో వెళ్తూ ముద్దులు పెట్టుకోవడం చేస్తుంటే.. మరికొందరు పార్కుల్లో అంతా చూస్తుండగానే సరసాలు ఆడుతుంటారు. అలాగే..

Viral video: జలకాలాటల్లోనూ ఇవేం పాడు పనులు.. ప్రేయసిని పైకి ఎత్తుకుని ఇతను చేసిన నిర్వాకం..

ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు వాహనాల్లో వెళ్తూ ముద్దులు పెట్టుకోవడం చేస్తుంటే.. మరికొందరు పార్కుల్లో అంతా చూస్తుండగానే సరసాలు ఆడుతుంటారు. అలాగే ఇంకొందరు మరింత దిగజారి ప్రవర్తించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘జలకాటల్లోనూ ఇవేం పాడు పనులు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఓ ప్రేమ జంట చేసిన నిర్వాకానికి అంతా అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్‌ వద్దకు వచ్చాడు. అందరిలా ఈత కొట్టాల్సిన అతను.. అందుకు విరుద్ధంగా చిత్రవచిత్ర విన్యాసాలు చేశాడు.

Viral video: స్నానం ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతను తెలివి మామూలుగా లేదుగా..


తన ప్రియురాలితో కలిసి స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్న భవనం మీదకు ఎక్కాడు. తర్వాత తన ప్రేయసిని పైకి ఎత్తుకుని (man jumps into swimming pool with girlfriend), వెనక్కు తిరిగి పల్టీలు కొడుతూ కింద ఉన్న నీళ్లలోకి దూకేశాడు. ఇతడి విచిత్ర విన్యాసం చూసి అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. వారు దూకే క్రమంలో ఏమాత్రం అదుపు తప్పినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.

Viral video: సముద్రం ఒడ్డున ప్రేమికుల సరసాలు.. వద్దంటున్నా యువతి బలవంతంగా చేసిన పనికి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేం విన్యాసంరా బాబోయ్’’.. అంటూ కొందరు, ‘‘ఇది మరీ దారుణం.. ఇలా చేయడం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: రైల్లో పవర్ బ్యాంక్ కొన్న వ్యక్తి.. అనుమానం వచ్చి తెరచి చూడగా.. షాకింగ్ సీన్..

Updated Date - Jun 19 , 2024 | 09:16 PM