Share News

Viral News: అత్తగారి ప్రవర్తనతో అల్లుడు షాక్.. భార్యను, కూతురిని ఇటలీ తీసుకెళ్లి ఏం చేశాడంటే..!

ABN , Publish Date - Aug 14 , 2024 | 10:51 AM

మంచి, మర్యాద లేకుండా ప్రవర్తించిన అత్తగారిపై అల్లుడికి కోపం వచ్చింది. అత్త తీరుతో కుటుంబంలో కలహాలు మొదలు కావడంతో అల్లుడు తట్టుకోలేకపోయాడు. కుటుంబం మొతాన్ని దేశం కాని దేశంలో వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Viral News: అత్తగారి ప్రవర్తనతో అల్లుడు షాక్.. భార్యను, కూతురిని ఇటలీ తీసుకెళ్లి ఏం చేశాడంటే..!
son-in-law was so upset with his mother-in-law

మంచి, మర్యాద లేకుండా ప్రవర్తించిన అత్తగారి (Mother-in-law)పై అల్లుడికి కోపం వచ్చింది. అత్త తీరుతో కుటుంబంలో కలహాలు మొదలు కావడంతో అల్లుడు (Son-in-law) తట్టుకోలేకపోయాడు. కుటుంబం మొతాన్ని దేశం కాని దేశంలో వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెటిజన్లు సుద్దులు చెప్పడంతో తప్పు తెలుసుకున్నాడు. ఈ పోస్ట్ రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. యూకేకు చెందిన ఓ 38 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఐదేళ్ల కూతురితో కలిసి వెనిస్‌ (Venice)కు వెకేషన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ వెకేషన్ గురించి తెలుసుకున్న భార్య తల్లి కూడా వస్తానంటే కాదనలేక అవునన్నాడు (Viral News).


వెనీస్‌లో అత్తగారితో సహా నలుగురూ ఒకే గదిలో ఉండాల్సి వచ్చింది. అక్కడ అతడికి సమస్యలు మొదలయ్యాయి. అత్తగారి తీరు తీవ్ర చిరాకు తెప్పించింది. ``ఆమె నా భార్య ఫేస్ వాష్, షాంపూ, లోషన్ వంటి ఖరీదైన ఉత్పత్తులను వాడేసేది. నా మంచం మీద ఎక్కువ సేపు కూర్చునేది. హెయిర్ డై కోసం నా అనుమతి లేకుండానే నా సూట్‌కేస్ తెరిచింది. నా టూత్‌పేస్ట్‌ను కూడా తీసుకుని వాడుకుంటోంది అని తెలియగానే నాకు కోపం వచ్చింది. అలా చేయవద్దని అత్తగారికి వార్నింగ్ ఇచ్చాను. ఆమె నా వార్నింగ్ గురించి నా భార్యకు చెప్పేసింద``ని ఆ వ్యక్తి చెప్పాడు.


తల్లి మాటలు విన్న భార్య తనతో గొడవకు దిగిందని, తీవ్ర చిరాకు వచ్చి వారందరినీ వెనిస్‌లోనే వదిలేసి ఇంటికి వచ్చేశానని ఆ వ్యక్తి రెడ్డిట్ ద్వారా తన ఫాలోవర్లతో పంచుకున్నాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన కొందరు వ్యక్తులు.. ``మీరు చేసింది చాలా తప్పు. వెనిస్ వెళ్లిన తర్వాత మీ అత్తగారికి సెపరేట్ రూమ్ తీసుకోవాల్సింది``, ``అత్తగారి మీద కోపంతో భార్యను, కూతురిని వేరే దేశంలో వదిలేయడం తప్పు`` అని కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు చూసిన సదరు వ్యక్తి తన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడతానని కామెంట్ చేశాడు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వార్నీ.. ఇంత క్రూరత్వమా.. మ్యాచ్‌లో ఓడిన విద్యార్థులపై టీచర్ ఘాతుకం.. కాలితో తంతూ, బూతులు తిడుతూ..


Picture Puzzle: మీ బ్రెయిన్ ఎంత స్పీడ్‌గా పని చేస్తోందో.. ఈ పజిల్‌ను సాల్వ్ చేస్తే తెలుస్తుంది..!


Viral Video: దీన్ని పిచ్చి అంటారు భయ్యా.. లెహంగా ధరించి రైల్వే స్టేషన్‌లో డ్యాన్స్.. చివర్లో ఏం చేశాడో చూస్తే..


Viral Video: ప్రాణాల మీద ఆశ లేదా? కదులుతున్న లారీ వెనకాల స్కేటింగ్.. షాకింగ్ వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2024 | 10:51 AM