Share News

Delhi: విమానం ఇంజిన్‌ని ఢీ కొట్టిన పక్షి.. ఆకాశంలోంచి నేరుగా...

ABN , Publish Date - May 26 , 2024 | 09:18 PM

విమాన ఇంజిన్‌ని(Aeroplane Engine) పక్షి ఢీ కొట్టడంతో విమానం ఎయిర్ పోర్ట్‌కి తిరిగి వచ్చిన ఘటన ఢిల్లీలో ఆదివారం జరిగింది. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి లేహ్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమాన ఇంజిన్‌ను ఓ పక్షి ఢీ కొట్టింది.

Delhi: విమానం ఇంజిన్‌ని ఢీ కొట్టిన పక్షి.. ఆకాశంలోంచి నేరుగా...

ఢిల్లీ: విమాన ఇంజిన్‌ని(Aeroplane Engine) పక్షి ఢీ కొట్టడంతో విమానం ఎయిర్ పోర్ట్‌కి తిరిగి వచ్చిన ఘటన ఢిల్లీలో ఆదివారం జరిగింది. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి లేహ్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమాన ఇంజిన్‌ను ఓ పక్షి ఢీ కొట్టింది.

దీంతో పైలట్.. విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి తీసుకొచ్చాడు. అధికారులు విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. IGI విమానాశ్రయం నుండి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి.. తిరిగి11.00 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది.


ఢిల్లీ నుండి లేహ్‌కు SG-123ని నడుపుతున్న స్పైస్‌జెట్ B737 విమానం ఇంజిన్ 2ని పక్షి ఢీకొనడంతో తిరిగి ఎయిర్‌పోర్ట్‌కి తిరిగివచ్చిందని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాకుండా సాధారణ ల్యాండింగ్ చేసిందని చెప్పారు. ఆ సమయంలో విమానంలో 135 మంది ఉన్నారు.

Read National News and Latest News here

Updated Date - May 26 , 2024 | 09:25 PM