Guinness Record: గిన్నిస్ రికార్డుల్లోకి ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్
ABN , Publish Date - Sep 08 , 2024 | 10:14 AM
సాధారణంగా ఐఫోన్ ఏ సైజులో ఉంటుంది. మన చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది అవునా.. మరి మనిషికంటే ఎత్తున్న ఐఫోన్‌ని మీరెప్పుడైనా చూశారా. చిత్రంలో కనిపిస్తున్నది నిజమైన ఐఫోనే.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఐఫోన్ ఏ సైజులో ఉంటుంది. మన చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది అవునా.. మరి మనిషికంటే ఎత్తున్న ఐఫోన్‌ని మీరెప్పుడైనా చూశారా. చిత్రంలో కనిపిస్తున్నది నిజమైన ఐఫోనే. ఇప్పుడు అది గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది.
ఇది 6.74 అడుగుల పొడవుగా ఉంటుంది. బ్రిటన్లో భారత సంతతి వ్యక్తి అరుణ్ ఓ గ్యాడ్జెట్ స్పెషలిస్టుతో కలిసి 6.74అడుగుల పొడవైన ఐఫోన్ 15ప్రొ మ్యాక్స్ రెప్లికాను రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్రతిరూపంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇందులో భారీ కెమెరాలున్నాయి. గేమింగ్ యాప్లనూ వినియోగించుకోవచ్చు. Mrwhosetheboss అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అరుణ్ టెక్నాలజీ సమాచారాన్ని అందిస్తున్నారు.
ఈ ఛానల్‌కి 19.4M సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మాథ్యూ పెర్క్స్ అనే గ్యాడ్జెట్ స్పెషలిస్టుతో కలిసి ఈ భారీ ఐఫోన్ రూపాన్ని తయారు చేశాడు. దీన్ని స్టాండ్‌పై అమర్చి స్థానిక వీధుల్లోకి తీసుకెళ్లగా.. ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. గతంలోనూ యూఎస్‌కు చెందిన మాథ్యూ బీమ్, జెడ్‌హెచ్‌సీ అనే యూట్యూబర్లు పెద్ద పెద్ద ఐఫోన్లను తయారు చేశారు. ఈసారి ఎలాగైనా గిన్నిస్ రికార్డు సాధించాలనే ఉద్దేశంతో భారీ ఐఫోన్‌ని రూపొందించినట్లు వారు చెప్పారు.
For Latest News click here