Share News

Viral Video: ఏం టెక్నిక్ తల్లీ.. టైమ్ వేస్ట్ కాకుండా చపాతీలను ఎలా వత్తేసిందో చూడండి.. వీడియో వైరల్!

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:53 PM

వేసవి వేడిలో గంటల తరబడి వంటగదిలో నిలబడి వంట చేయడం చాలా కష్టమైన పని. చెమటలు కక్కుకుంటూ పని చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చపాతీలు చేయడం చాలా చిరాకు కలిగించే పని. కుటుంబ సభ్యులందరికీ సరిపోయేలా చపాతీలు వత్తడం, కాల్చడం చాలా పెద్ద ప్రాసెస్.

Viral Video: ఏం టెక్నిక్ తల్లీ.. టైమ్ వేస్ట్ కాకుండా చపాతీలను ఎలా వత్తేసిందో చూడండి.. వీడియో వైరల్!
Making Roti

వేసవి (Summer) వేడిలో గంటల తరబడి వంటగదిలో (Kitchen) నిలబడి వంట చేయడం చాలా కష్టమైన పని. చెమటలు కక్కుకుంటూ పని చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చపాతీలు చేయడం చాలా చిరాకు కలిగించే పని (Making Roti). కుటుంబ సభ్యులందరికీ సరిపోయేలా చపాతీలు వత్తడం, కాల్చడం చాలా పెద్ద ప్రాసెస్. అందుకే ఓ మహిళ ఓ ట్రిక్కుతో చాలా సులభంగా చపాతీలను వత్తి, కాల్చేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Jessika_guptaa అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ ప్రత్యేకమైన పద్ధతిలో చపాతీలు చేస్తోంది. ఆమె మొత్తం పిండిని తీసుకుని, వంటగది ప్లాట్‌ఫారమ్‌పై పెట్టి వత్తేసింది. ఆ తర్వాత వాటిని ఓ గిన్నె సహాయంతో రౌండ్‌గా కట్ చేసింది. తర్వాత ఒక పెద్ద పెనం మీద మూడు రోటీలను కలిపి కాల్చి, ఆపై వాటిని చిన్న పాన్‌లోకి మార్చి, ఆ తర్వాత మంట మీద పెట్టి కాల్చుతోంది. ఆమె చాలా సులభంగా, వేగంగా పెద్ద మొత్తంలో చపాతీలను తయారు చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోకు 4.2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 10 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇకపై ఈ ట్రిక్ ఉపయోగిస్తాను``, ``సమయాన్ని, శక్తిని ఆదా చేయండి``, ``ఇలా చేయడం వల్ల గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతుంది``, ``కష్టపడి పని చేయకండి, తెలివిగా పని చేయండి``, ``ఈమె ఓ సైంటిస్ట్ కావడానికి అర్హురాలు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ తెలివి తేటలు చదువులో పెడితే.. ఓ స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్ చూసి నివ్వెరపోయిన టీచర్.. ఏం జరిగిందంటే..


Viral Video: దుబాయ్ వరదలే కాదు.. ఒళ్లు గగుర్పొడిచే ఈ రెండు వీడియోలు చూస్తే ప్రకృతి శక్తి ఎంటో తెలుస్తుంది..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2024 | 04:53 PM