Share News

Guinness Record: ఎంత మెచ్చుకున్నా తక్కువే.. 2600 లీటర్ల రొమ్ము పాలు దానం చేసిన మహిళ

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:08 PM

అమెరికాలోని టెక్సస్ నివాసి అలిస్సా ఓగ్లేట్రీ అనే రొమ్ము పాల దానంలో తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఏకంగా 2,645.58 లీటర్ల రొమ్ము పాలు దానం చేసిన వ్యక్తిగా ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.

Guinness Record: ఎంత మెచ్చుకున్నా తక్కువే.. 2600 లీటర్ల రొమ్ము పాలు దానం చేసిన మహిళ
Guinness Record: ఎంత మెచ్చుకున్నా తక్కువే.. 2600 లీటర్ల రొమ్ము పాలు దానం చేసిన మహిళ

టెక్సస్: అమెరికాలోని టెక్సస్‌కు చెందిన అలిస్సా ఓగ్లేట్రీ అనే రొమ్ము పాల దానంలో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఏకంగా 2,645.58 లీటర్ల రొమ్ము పాలు దానం చేసిన వ్యక్తిగా ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఓగ్లెట్రీ వయసు 36 సంత్సరాలు అని, 2014లో ఆమె 1,569.79 లీటర్ల పాలు దానం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ సృష్టించిందని, ఇప్పుడు దానిని తిరగరాసిందని ‘ది గార్డియన్’ కథనం పేర్కొంది. ఒక లీటరు రొమ్ము పాలను 11 మంది నవజాత శిశువులకు పట్టించవచ్చని ‘మదర్స్ మిల్క్ బ్యాంక్ ఆఫ్ నార్త్ టెక్సస్’ అని పేర్కొంది. ఓగ్లేట్రీ తన రొమ్ము పాల ద్వారా మొత్తం 350,000 మంది శిశువులకు సహాయం చేసిందని మదర్స్ మిల్క్ బ్యాంక్ ఆఫ్ నార్త్ టెక్సస్ అంచనా వేసింది.


గిన్నిస్ రికార్డు సాధించడంపై ఓగ్లేట్రీ స్పందించింది. ‘‘నాది చాలా పెద్ద సహృదయం. కానీ మిల్క్ ఇవ్వడం ద్వారా నేను సంపాదించేది ఏమీ ఉండదు. మంచి పనుల కోసం నేను అదే పనిగా డబ్బులు ఇచ్చే స్థితిలో లేను. అయితే పాలు దానం చేయగలగడమే నా దగ్గర ఉన్న ఏకైక మార్గం. నేను 350,000 మంది పిల్లలకు సహాయం చేశాను’’ అని ఆమె పేర్కొంది. ఈ మేరకు ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.


కాగా ఓగ్లెట్రీ 2010 నుంచి పాలు దానం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె కొడుకు పుట్టాడు. ఇప్పు పిల్లాడి వయసు 14 సంవత్సరాలు. పిల్లాడు పుట్టినప్పుడు తనకు అసాధారణ రీతిలో పాలు ఉత్పత్తి అవుతున్నాయని ఆమె గుర్తించింది. పాలు ఎక్కువగా ఉంటే ఇతరులకు దానం చేయవచ్చంటూ ఒక సలహా ఇచ్చింది. అప్పటి నుంచి రొమ్ము పాలు దానం చేయడాన్ని ఒక అభిరుచిగా మార్చుకొని పాలు ఇస్తోంది. కాగా పెద్ద కొడుకు కైల్ తర్వాత మరో ఇద్దరు మగ పిల్లలు ఆమెకు జన్మించారు. పిల్లల పేర్లు కేజ్ (12), కోరీ (7).

Updated Date - Nov 10 , 2024 | 12:11 PM