Viral Video: బాబూ.. ఇదేం పని.. రైలు బాత్రూమ్ పక్కన ఉల్లిపాయల కటింగ్.. నెటిజన్లు షాక్..
ABN , Publish Date - Oct 23 , 2024 | 01:07 PM
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. అయితే రైళ్లలో దొరికే ఆహారానికి మాత్రం చాలా మంది ప్రయాణికులు దూరంగా ఉంటారు. దానికి కారణంగా రైళ్లలో అమ్మే ఆహారం చాలా అపరిశుభ్రంగా ఉంటుంది. ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది.
మన దేశంలో చాలా మంది రైలు ప్రయాణాన్నే (Train Journey) ఎక్కువగా ఇష్టపడతారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. అయితే రైళ్లలో దొరికే ఆహారానికి (Food in Train) మాత్రం చాలా మంది ప్రయాణికులు దూరంగా ఉంటారు. దానికి కారణంగా రైళ్లలో అమ్మే ఆహారం చాలా అపరిశుభ్రంగా ఉంటుంది. ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. రైళ్లలో అమ్మే ఫుడ్‌ను ఎలా తయరు చేస్తారో, ఎలా స్టోర్ చేస్తారో తెలిపే వీడియోలు ఇప్పటికే ఎన్నో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మరో వీడియో నెటిజన్లకు ట్రైన్ ఫుడ్ అంటేనే దడ పుట్టిస్తోంది (Viral Video).
@Tiwari_Saab అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి పల్లీ మసాలా కోసం రైలు ఫ్లోర్ పైనే ఉల్లిపాయలను (Onions) పెట్టి కట్ చేసేస్తున్నాడు. బాత్రూమ్ పక్కన కూర్చుని అందరూ నడిచే ఫ్లోర్‌పైనే ఉల్లిపాయలు పెట్టి వాటిని కట్ చేసేస్తున్నాడు. వాటిని పల్లీ మసాలాలో కలిపేసి ప్రయాణికులకు అమ్మేస్తున్నాడు. ఆ రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళనకు గురవుతున్నారు. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వివిధ హ్యాండిల్స్ ద్వారా బాగా వైరల్ అవుతోంది. రైళ్లలో అమ్మే ఆహారం నాణ్యతపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ``ఇది ఎంత దారుణం. కొనే వారి ఆరోగ్యంతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు``, `` రైలులో అమ్మే వారి నుంచి పొరపాటున కూడా కొనకూడదు``, ``ఇంతకంటే దారుణమైన పరిస్థితులు రైలు క్యాంటిన్‌లో ఉంటాయి``, ``అవి కొని తినే వారి ఆరోగ్యం దైవాధీనం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Tibet: మన కళ్ల ముందే పరిణామ క్రమం.. టిబెట్ మహిళల శరీరతత్వంపై వెలువడిన ఆసక్తికర పరిశోధన..
Optical Illusion: మీరు ఎంత వేగంగా ఆలోచించగలరు?.. ఈ ఫొటోలో తప్పును 4 సెకెన్లలో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.