Viral: అయ్యో.. ‘వందేభారత్’లో కూడా ఇదే సీన్! షాకింగ్ వీడియో
ABN , Publish Date - Jun 10 , 2024 | 09:19 PM
ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన వందేభారత్ రైలు వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జనరల్ బోగీని గుర్తుకు తెస్తున్న ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: భారత రైల్వే ప్రయాణికులకు అది పెద్ద సమస్య రద్దీ. రిజర్వ్ కంపార్ట్‌మెంట్లలో కూడా జనరల్ టిక్కెట్టు ఉన్న వారు, అసలు టిక్కెట్టే లేని వారు ఎక్కేస్తూ రద్దీకి కారణమవుతున్నారు. డిమాండ్ తగ్గట్టుగా రైళ్లు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే, సాధారణ రైళ్లకే పరిమితమైన ఈ సమస్య ప్రస్తుతం వందేభారత్ రైల్లోనూ కాలుపెట్టడంతో నెట్టింట గగ్గోలు రేగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.
Viral: మహిళలూ.. హోటల్స్‌కు వెళుతున్నారా? జాగ్రత్త.. ఇలాంటోళ్లూ పొంచి ఉంటారు!
లఖ్నవూ జంక్షన్, డెహ్రాడూన్‌ల మధ్య నడిచే వందేభారత్‌లో ఈ దృశ్యం కనిపించిందని నెటిజన్లు చెబుతున్నారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, స్టేషన్‌లో ఆగి ఉన్న వందే భారత్ రైలు మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. సీట్లన్నీ ప్రయాణికులతో నిండిపోగా అనేక మంది సీట్ల మధ్య దారిలో నిలబడి కనిపించారు. కనీసం కాలుపెట్టేందుకు కూడా జాగా లేనంతగా రైలు ప్రయాణికులతో కిటకిటలాడింది. జనరల్ బోగీని తలపించే స్థాయిలో జనాలతో బోగీ నిండిపోయింది. వీళ్లంతా జనరల్ టిక్కెట్టు ప్రయాణికులన్న వాదనలు వైరల్ అవుతున్నాయి (Video of Overcrowded Vande Bharat Express Sparks Concern).
ఇక వీడియోలో ఇదంతా చూసిన జనాలు మండిపడుతున్నారు. వేలు పెట్టి వందే భారత్ టిక్కెట్టు కొనుకున్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి అవసరాలు తీర్చే స్థాయిలో రైళ్లను అందుబాటులోకి తెస్తేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని కొందరు అన్నారు. టిక్కెట్టు లేని వారిని స్టేషన్‌లోకి అనుమతించకుండా ఉండటం మరో పరిష్కారమని ఇతరులు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో వైరల్ అవుతోంది.