Share News

Winter Offer: వింటర్ ఆఫర్స్.. అతి తక్కువ ధరకే టాప్ 5 స్మార్ట్ గీజర్స్..

ABN , Publish Date - Oct 24 , 2024 | 11:07 AM

Smart Geysers Under Rs. 20K చలికాలం వచ్చేస్తోంది. చలి కారణంగా ఉదయం నిద్ర లేవాలంటే చాలా బద్దకిస్తుంటారు జనాలు. ఇక స్నానం విషయానికి వచ్చే సరికి హడలిపోతుంటారు. శీతాకాలంలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. అందుకే చలికి స్నానం చేయాలంటే వణికిపోతుంటారు. అందుకే చాలా మంది చలికాలంలో స్నానం చేసేందుకు వేడినీళ్లు పెట్టుకుంటారు.

Winter Offer: వింటర్ ఆఫర్స్.. అతి తక్కువ ధరకే టాప్ 5 స్మార్ట్ గీజర్స్..
Smart Geysers

Smart Geysers Under Rs. 20K: చలికాలం వచ్చేస్తోంది. చలి కారణంగా ఉదయం నిద్ర లేవాలంటే చాలా బద్దకిస్తుంటారు జనాలు. ఇక స్నానం విషయానికి వచ్చే సరికి హడలిపోతుంటారు. శీతాకాలంలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. అందుకే చలికి స్నానం చేయాలంటే వణికిపోతుంటారు. అందుకే చాలా మంది చలికాలంలో స్నానం చేసేందుకు వేడినీళ్లు పెట్టుకుంటారు. ఎలక్ట్రిక్ హీటర్స్ ఉపయోగించి వాటర్ హీట్ చేయడం గానీ.. గ్యాస్ స్టౌ మీద గానీ నీటిని వేడి చేసుకుంటారు. మరికొందరు.. వాటర్ గీజర్స్‌ని ఉపయోగిస్తారు. ప్రస్తుత కాలంలో చాలా ఇళ్లలో గీజర్స్‌ వాడకం పెరిగింది. మంచి కంపెనీలకు చెందిన గీజర్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో.. ప్రజలు గీజర్స్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

అయితే, ఇప్పుడు రానున్నది శీతాకాలం. ఈసారి చలి తీవ్రంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. ఇప్పటికే చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. జనవరి, ఫిబ్రవరి నాటికి ఈ చలి మరింత పీక్స్‌కు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది స్నానం కోసం గీజర్స్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో అతి తక్కువ ధరకే, మంచి నాణ్యమైన గీజర్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు.. వీటిని రిమోట్‌గా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. వైఫై కనెక్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. పైగా విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. రూ. 20 వేల లోపు ఉన్న టాప్ 5 కంపెనీల స్మార్ట్ గీజర్స్ వివరాలు మీకోసం..


హయర్(Haier 15 Litres 5 Star Smart Wi-Fi Water Heater)..

Haier కొత్త వాటర్ హీటర్ స్మార్ట్ వైఫై టెక్నాలజీతో వస్తుంది. అవసరాలకు అనుగుణంగా నీటి ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవచ్చు. ఇది ఐబీపీఎస్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది నీటిని చాలా త్వరగా వేడి చేస్తుంది. నీటిలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఈ గీజర్‌లో మూడు లేయర్ల ఆల్ట్రా మైక్రో కోటింగ్ ట్యాంక్ ఉంది. ఇది చాలా నాణ్యమైనది. ఇక దీని ధర రూ. 10,999 మాత్రమే.

హింద్‌వేర్(Hindware Atlantic Ondeo Evo Ipro 25L)..

ఈ వాటర్ హీటర్ Wi-Fiకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వేడి నీటితో స్నానం ఎప్పుడు చేయాలో కూడా సూచిస్తుంది. విద్యుత్ ఎంత వినియోగిస్తుందో కూడా తెలియజేస్తుంది. గీజర్‌ను నిర్ణీత సమయంలో ఆటోమాటిక్ ఆన్, ఆఫ్ చేసుకునేందుకు ఆప్షన్ కూడా ఉంది. ఈ గీజర్ అలెక్సా, గూగుల్‌ స్పీక్ ఆప్షన్ ఉంది. దీనిని టైటానియం కోర్ షీల్డ్‌తో తయారు చేశారు. తుప్పు పట్టుకుండా ఎక్కువ కాలం మన్నికవుతుంది. ఇతర బ్రాండ్ల హీటర్ల కంటే ఎక్కువ లైఫ్‌టైమ్ ఉంటుంది. దీని ధర మార్కెట్‌లో రూ. 14,189 గా ఉంది.


ఏవో స్మిత్ హీట్ బాట్(AO Smith HeatBot Wifi 25L)..

ఈ వాటర్ హీటర్ లో 25 లీటర్ల నీటిని ఉంచుకోవచ్చు. ఈ హీట్‌బాట్ వైఫై టెక్నాలజీని కలిగి ఉంది. ట్యాంక్ లోపల బ్లూ డైమండ్ గ్లాస్ ఏర్పాటు చేయబడింది. ఇది నీటిలో ఉండే ఖనిజాల కారణంగా ట్యాంక్ తుప్పు పట్టకుండా కాపాడుతుంది. ఈ గీజర్‌లో ఒక ప్రత్యేక రకం అల్లాయ్ యానోడ్ ఇన్‌స్టాల్ చేయబడింది. దీని కారణంగా ఇది ఇతర గీజర్‌ల కంటే రెండు రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది డిజిటల్ టచ్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. అంతేకాదు.. దీనిని బకెట్ బాత్, పాదాలను కడగడం, బట్టలు ఉతకడం, నేలను శుభ్రం చేయడం వంటి వివిధ మార్గాల్లో కూడా ఉపయోగించవచ్చు. దీని ధర రూ. 19,028 ఉంది.


వి-గార్డ్ (V-Guard Pebble Shine Geyser 25 Litre Water Heater)..

ఈ వాటర్ హీటర్ టైటానియంతో తయారు చేయబడిన ప్రత్యేక పూతని కలిగి ఉంటుంది. ఇందులో రస్ట్ ఏర్పడే అవకాశం ఉండదు. హీటర్‌పై 2 సంవత్సరాలు, హీటింగ్ ఎలిమెంట్‌పై 4 సంవత్సరాలు, ట్యాంక్‌పై 7 సంవత్సరాలు వారంటీ ఉంది. దీని ధర రూ. 9,499 గా ఉంది. దీనికి కూడా వైఫై, రిమోట్ కంట్రోల్ వెసులుబాటు ఉంది.

హావెల్స్ గీజర్(Havells Adonia-i 25 Litre)..

ఈ గీజర్‌కి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దీనిని ఐఫోన్, ఆండ్రాయిడ్‌ ఫోన్ ద్వారా నియంత్రించొచ్చు. దీనికి వైఫైని కూడా కనెక్ట్ చేయొచ్చు. తద్వారా దీనిని మీరు ఎక్కడి నుండైనా నియంత్రించవచ్చు. హీటర్ సమయం, ఉష్ణోగ్రతను కూడా సెట్ చేయవచ్చు. ఈ గీజర్ అలెక్సా, గూగుల్ రెండింటి సహాయంతో పనిచేస్తుంది. చాలా ఒత్తిడిని తట్టుకోగలదు. దీని ధర రూ. 16,699 గా ఉంది.


Also Read:

ఏటీఎంలో నగదును చూసి యువతి చేసిన నిర్వాకమిదీ..

వేగంగా దూసుకొస్తున్న ‘దానా’..

ఈ చిరుత ఎప్పటికి దొరికేనో..

For More Special News and Telugu News..

Updated Date - Oct 24 , 2024 | 11:07 AM