Share News

Rashid Khan: వైభవంగా ఆఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహం.. నెట్టింట వీడియోలు వైరల్!

ABN , Publish Date - Oct 04 , 2024 | 09:43 AM

ఆష్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. అక్టోబర్ 3న పాష్తూన్ సంప్రదాయం ప్రకారం అతడి వివాహం జరిగింది. కాబూల్‌లో అంగరరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి తాలూకు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Rashid Khan: వైభవంగా ఆఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహం.. నెట్టింట వీడియోలు వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. అక్టోబర్ 3న పాష్తూన్ సంప్రదాయం ప్రకారం అతడి వివాహం జరిగింది. కాబూల్‌లో అంగరరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి తాలూకు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతున్నాయి. అభిమానులతో పాటు స్టార్ క్రికెటర్‌లు అనేక మంది అతడికి శుభాకాంక్షలు తెలిపారు.

అతడి వివాహం జరిగిన హోటల్ ముందు అనేక మంది భారీ తుపాకులు పట్టుకుని సంచరించడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇక అతడి వివాహం కోసం హోటల్‌ను రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కళ్లుమిరుమిట్లు గొపేలా బంగారు వర్ణంలో వేదిక మొత్తాన్ని అలంకరించారు. ఈ ఏర్పాట్లు అనేక మందికి ఆకట్టుకున్నాయి (Afghanistan all rounder Rashid Khans grand wedding in Kabul).

Womens T20 World Cup 2024: టీమిండియా ఉమెన్స్ ఫస్ట్ మ్యాచ్.. ఇలా ఫ్రీగా వీక్షించండి..


ఆప్ఘాన్ జాతీయ జట్టు సభ్యులు అందరూ ఈ వివాహ వేడుకకు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఖరీదైన బహుమతులు అందజేశారు. సోషల్ మీడియాలో కూడా క్రికెటర్‌లు రషీద్ ఖాన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ప్రయాణం అద్భుతంగా సాగాలని అభిలషించారు. జీవితంలో మరో అధ్యయనం ప్రారంభించబోతున్నందుకు శుభాకాంక్షలని జాతీయ టీం వెటరన్ క్రీడాకారుడు ముహమ్మద్ నబీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. అతడి జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్యర్యంతో నిండిపోవాలని ఆకాక్షించాడు.

టీ20 ఫార్మాట్ టాప్ బౌలర్లలో ఒకడిగా రషీద్ ఖాన్ అపార పేరు ప్రఖ్యాతులు గడించాడు. అవసరమైనప్పుడు బ్యాట్ ఝళిపించగలిగే సత్తా ఉన్న అతడు ఆల్ రౌండర్‌గా కూడా పేరు సంపాదించాడు. దీంతో, ప్రపంచంలోని టాప్ క్రికెటర్లలో ఒకడిగా గుప్తింపు సొంతం చేసుకున్నాడు.

Cricket: ఒక ఓవర్‌లో 7 సిక్సులు.. భారత బ్యాట్స్‌మెన్ సంచలనం..


ఆప్ఘానిస్థాన్‌ క్రికెట్‌పై అతడి ప్రభావం గొప్పదని కూడా క్రికెట్ అభిమానులు చెబుతుంటారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆప్ఘాన్ గెలుపులో రషీద్ కీలక పాత్ర పోషించాడు. తన టీ20 కెరీర్‌లో 152 వికెట్లు, 105 వన్డేల్లో 190 వికెట్లతో బౌలర్‌గా తన సత్తా ఎంటో ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో రషీద్ కెప్టెన్‌కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఆ సీరిస్‌లో తన జట్టుకు పలు మరపురాని విజయాలు అందించాడు.

కెప్టెన్‌గా, ప్లేయర్‌గా అనేక విజయాలు అందుకుంటున్న రషీద్ వివాహానికి ఆఫ్ఘన్ క్రికెటర్లు అందరూ హాజరయ్యారు. రషీద్ పెళ్లికి అక్కడి ప్రముఖులు భారీగా హాజరు కావడం.. రానురాను పెరుగుతున్న అతడి పాప్యులారిటీకి అద్దం పడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక అభిమానులు మాత్రం అతడి పెళ్లి వీడియోలను ట్రెండ్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు.


Read Latest and Cricket News

Updated Date - Oct 04 , 2024 | 09:52 AM