Hardik Pandya: ఊచకోతకు హార్దిక్ కొత్త డెఫినిషన్.. ఎవర్నీ వదలకుండా పిచ్చకొట్టుడు కొట్టాడు
ABN , Publish Date - Nov 23 , 2024 | 08:48 PM
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జోరు తగ్గడం లేదు. బరిలోకి దిగిన ప్రతిసారి విధ్వంసక ఇన్నింగ్స్‌లతో అతడు చెలరేగుతున్నాడు. తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు.
SMAT 2024: నేషనల్ మ్యాచ్ అయినా ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా తాను బరిలోకి దిగనంత వరకే అంటున్నాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్స్ అంటూ సంచలన ప్రదర్శనలతో చెలరేగుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున సూపర్బ్ పెర్ఫార్మెన్స్‌లతో అదరగొడుతున్నాడు పాండ్యా. ఇటీవల మెన్ ఇన్ బ్లూ టీ20 వరల్డ్ కప్-2024ను సొంతం చేసుకోవడంలోనూ అతడి రోల్ ఎంతగానో ఉంది. అలాంటోడు ఇప్పుడు తనకు అన్నీ ఇచ్చిన బరోడా తరఫున చెలరేగి ఆడుతున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు హార్దిక్.
బ్యాట్‌తో తాండవం
నిన్న మొన్నటి వరకు ఇంటర్నేషనల్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్న పాండ్యా.. హఠాత్తుగా డొమెస్టిక్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. నేషనల్ డ్యూటీ లేని టైమ్‌లో దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనంటూ భారత క్రికెట్ బోర్డు కొత్త రూల్ తీసుకురావడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో తన సొంత జట్టు బరోడా తరఫున ఆడాలని పాండ్యా డిసైడ్ అయ్యాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన స్టార్ ఆల్‌రౌండర్.. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 35 బంతుల్లోనే 74 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 211 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అతడు.. మొదటి బంతి నుంచే అటాకింగ్‌కు దిగాడు. బ్యాట్‌తో తాండవం ఆడాడు.
బాదుడే బాదుడు
వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీ లైన్‌కు తరలించాడు పాండ్యా. బౌలర్ ఎవరనేది చూడకుండా స్టాండ్స్‌లోకి తరలించడమే లక్ష్యంగా బాదుతూ పోయాడు. ఎవర్నీ వదలకుండా అందర్నీ ఉతికి ఆరేశాడు. 6 బౌండరీలు కొట్టిన స్టార్ ఆల్‌రౌండర్.. మరో 5 భారీ సిక్సులు బాదాడు. అతడికి తోడుగా శివాలిక్ శర్మ (64) కూడా రాణించడంతో బరోడా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు నాటౌట్‌గా ఉన్న పాండ్యా.. బరోడాను కూల్‌గా విజయతీరాలకు చేర్చాడు. బ్యాటింగ్‌లో అదరగొట్టిన హార్దిక్.. బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. 4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు.
Also Read:
ఆసీస్‌కు కొత్త మొగుడు.. కోహ్లీని మించిపోయాడుగా..
సచిన్‌ను గుర్తుచేసిన రాహుల్.. చూసేందుకు రెండు కళ్లు చాలవంతే..
ఆసీస్‌తో ఆడుకున్న రాహుల్-జైస్వాల్.. ఏం ఆడారు భయ్యా
For More Sports And Telugu News