Share News

U19 Asia Cup 2024: 13 ఏళ్ల వైభవ్ బ్యాటింగ్ విధ్వంసం.. ఫైనల్స్‌కు టీమిండియా

ABN , Publish Date - Dec 06 , 2024 | 05:12 PM

U19 Asia Cup 2024: భారత కుర్రాళ్లు అదరగొట్టాడు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీఫైనల్‌లో పొరుగు దేశం శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించారు.

U19 Asia Cup 2024: 13 ఏళ్ల వైభవ్ బ్యాటింగ్ విధ్వంసం.. ఫైనల్స్‌కు టీమిండియా

భారత కుర్రాళ్లు సాధించారు. తాము అనుకున్నది చేసి చూపించారు. కోట్లాది మంది అభిమానుల్లో సంతోషం నింపారు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు క్వాలిఫై అయింది యువ భారత్. శ్రీలంకతో శుక్రవారం షార్జా వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది మెన్ ఇన్ బ్లూ. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సూపర్బ్ నాక్‌తో టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు ఆయుష్ మాత్రే కూడా రాణించడంతో ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది భారత్.


కుప్పకూల్చారు

సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులు చేసింది. లక్విన్ అబేసింఘే (69), షరుజన్ షణ్ముగనాథన్ (42) రాణించారు. వీరిద్దరూ తప్పితే మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. భారత బౌలర్లలో చేతన్ శర్మ 3 వికెట్లతో మ్యాజిక్ చేశాడు. కిరన్ కోర్మలే, ఆయుష్ మాత్రే చెరో 2 వికెట్లతో లంక నడ్డి విరిచారు. ఆ తర్వాత ఛేజింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. 21.4 ఓవర్లలోనే 175 పరుగులు చేసి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.


దంచుడే దంచుడు

భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఇద్దరూ అదరగొట్టారు. ఆయుష్ మాత్రే (34) మంచి స్టార్ట్ అందించాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (36 బంతుల్లో 67) విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడు. స్టైలిష్ షాట్లతో లంక బౌలర్లను బెంబేలెత్తించాడు. 6 బౌండరీలు బాదిన సూర్యవంశీ.. 5 సిక్సులతో ప్రత్యర్థికి నరకం చూపించాడు. వైభవ్-ఆయుష్ ఔట్ అయినా.. కెప్టెన్ మహ్మద్ అమాన్ (25 నాటౌట్), కేపీ కార్తికేయ (11 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు ఆడిన తీరు చూస్తుంటే ఆసియా కప్ మనదేననే భరోసా ఇస్తున్నారు. ఫైనల్‌లో ఇదే పెర్ఫార్మెన్స్‌ను రిపీట్ చేస్తే కప్పు కొట్టడం ఖాయం.


Also Read:

ఒకేరోజు 12 మంది క్రికెటర్ల బర్త్‌డే.. బుమ్రా, జడ్డూ సహా లిస్ట్‌లోని స్టార్లు వీళ్లే..

సచిన్‌ను గుర్తుచేసిన తెలుగోడు.. సేమ్ టు సేమ్

ఆసీస్‌కు పోయించిన తెలుగోడు.. కెరీర్‌లో మర్చిపోని ఇన్నింగ్స్

For More Sports And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 05:21 PM