Bumrah vs Konstas: అందర్నీ భయపెట్టే బుమ్రానే వణికించాడు.. ఎవరీ కోన్స్టాస్..
ABN , Publish Date - Dec 26 , 2024 | 05:42 PM
Bumrav vs Konstas: జస్‌ప్రీత్ బుమ్రా.. ఈ పేరు చెబితేనే ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోతారు. అతడి నిప్పులు చెరిగే బంతుల్ని ఎదుర్కోలేక తోపు ప్లేయర్లు కూడా తోకముడిచిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఇంత ట్రాక్ రికార్డు ఉన్న బుమ్రాను ఓ బచ్చా బ్యాటర్ భయపెట్టాడు.
IND vs AUS: జస్‌ప్రీత్ బుమ్రా.. ఈ పేరు చెబితేనే ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోతారు. అతడి నిప్పులు చెరిగే బంతుల్ని ఎదుర్కోలేక తోపు ప్లేయర్లు కూడా తోకముడిచిన సందర్భాలు కోకొల్లలు. బౌన్సర్లు, యార్కర్లు, స్వింగర్లు, స్లో డెలివరీస్.. ఇలా తన అమ్ములపొదిలోని పదునైన అస్త్రాలతో అవతలి జట్లను బెదరగొట్టడం బుమ్రాకు అలవాటుగా మారింది. భారత్‌తో మ్యాచ్ అంటే చాలు.. అపోజిషన్ టీమ్స్ జడుసుకునేలా చేస్తున్నాడు బుమ్రా. అయితే ఇంత ట్రాక్ రికార్డు ఉన్న బుమ్రాను ఓ బచ్చా బ్యాటర్ భయపెట్టాడు. ర్యాంప్ షాట్లతో నంబర్ వన్ బౌలర్‌ను హడలెత్తించాడు. ఏకంగా ఒకే ఓవర్‌లో 18 పరుగులు రాబట్టాడు. ఇంతకీ ఎవరా బ్యాటర్? బుమ్రాపై ఎలా సక్సెస్ అయ్యాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
విరుచుకుపడ్డాడు
టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా బౌలింగ్‌లో ఓ బ్యాటర్ సిక్స్ కొట్టి 1,445 రోజులు అవుతోంది. గత 4,483 బంతుల్లో భారత బౌలర్ బౌలింగ్‌లో ఒక్క సిక్స్ కూడా నమోదు అవ్వలేదు. ఎదురులేని ఈ రికార్డు ఇవాళ బ్రేక్ అయింది. అయితే దాన్ని బద్దలు కొట్టింది ఎవరో తోపు ప్లేయర్ అనుకుంటే పొరపాటే. ఈ పని చేసింది మరెవరో కాదు.. 19 ఏళ్ల కుర్రాడు, అరంగేట్ర ఆటగాడు, జూనియర్ పాంటింగ్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఆస్ట్రేలియా యంగ్ ఓపెనర్ శామ్ కోన్స్టాస్. బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి రోజు అందరి అటెన్షన్‌ను తన వైపునకు తిప్పుకున్నాడతను. బుమ్రా బౌలింగ్‌లో 2 సిక్సులు సహా బౌండరీలు కొట్టి.. ఒకే ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు కోన్స్టాస్. 65 బంతుల్లో 5 బౌండరీలు, 2 సిక్సులతో 60 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. దీంతో అంతా అతడి గురించే చర్చించుకుంటున్నారు.
అదే కలిసొచ్చింది
140 నుంచి 150 కిలోమీటర్ల భీకర వేగంతో బుమ్రా సంధించిన స్టన్నింగ్ డెలివరీస్‌ను వికెట్ల పక్క నుంచి జరిగి సిక్సులుగా మలిచాడు కోన్స్టాస్. టీ20ల మాదిరి ర్యాంప్ షాట్లతో బంతుల్ని స్టేడియంలోకి తరలించాడు. ఏ భయం లేకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించిన ఈ కోన్స్టాస్ మామూలు ఆటగాడు కాదు. అనుభవం తక్కువే గానీ ధైర్యం ఎక్కువే. ఆసీస్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఇటీవల వరుస సెంచరీలు బాదాడతను. బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. క్రీజులో ఉన్నంత సేపు ఉతుకుడే ధ్యేయంగా ఆడే అతడు.. తనకు దొరికిన ఫస్ట్ ఛాన్స్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇతర బ్యాటర్లలా క్రీజులో నిల్చొని ఆడితే కష్టమని భావించి.. బుమ్రా బౌలింగ్‌లో అన్‌ఆర్థడాక్స్ షాట్లు ఆడాడు. అది భలే వర్కౌట్ అయింది. అయితే పర్ఫెక్ట్ టైమింగ్, ఫియర్‌లెస్ అప్రోచ్ అతడి సక్సెస్‌కు కారణంగా కనిపిస్తున్నాయి.
Also Read:
జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్.. గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా అంటూ..
జూనియర్ పాంటింగ్‌తో ఫైట్.. కోహ్లీకి షాక్ ఇచ్చిన ఐసీసీ
తగలరాని చోట తగిలిన బంతి.. స్మిత్ రియాక్షన్ వైరల్
సస్పెన్షన్ సమయంలో టోర్నీలు ఎలా ఆడింది?
For More Sports And Telugu News