Share News

Virat Kohli: కోహ్లీ కొత్త అవతారం.. ఇక కంగారూల ఖేల్ ఖతం

ABN , Publish Date - Dec 11 , 2024 | 10:37 AM

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపర్చుకుంటూ ఉంటాడు. దశాబ్దంన్నర కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నా.. ఇప్పటికీ కొత్త ఆటగాడి మాదిరిగా ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటాడు.

Virat Kohli: కోహ్లీ కొత్త అవతారం.. ఇక కంగారూల ఖేల్ ఖతం
Virat Kohli

IND vs AUS: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపర్చుకుంటూ ఉంటాడు. దశాబ్దంన్నర కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నా.. ఇప్పటికీ కొత్త ఆటగాడి మాదిరిగా ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటాడు. వరల్డ్ బెస్ట్ క్రికెటర్స్‌లో ఒకడిగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నా పర్ఫెక్షన్ కోసం ఇంకా పరితపిస్తూనే ఉంటాడు. నేర్చుకోవాలనే తత్వం, బెస్ట్ ఇవ్వాలనే తపనే అతడ్ని ఈ స్థాయికి చేర్చాయి. ప్రత్యర్థులకు షాక్ ఇచ్చేందుకు అప్పుడప్పుడూ కొత్త అవతారం ఎత్తుతాడు కోహ్లీ. ఆస్ట్రేలియా కోసం మళ్లీ అలాంటి పనే చేస్తున్నాడు కింగ్. ఆ కథాకమామీషు ఏంటో ఇప్పుడు చూద్దాం..


ఫర్ ఏ ఛేంజ్..

ఆసీస్‌ను కంగారెత్తించేందుకు కోహ్లీ బౌలర్ అవతారం ఎత్తాడు. ఎప్పుడూ బ్యాట్‌తో వీరవిహారం చేసే కింగ్.. ఈసారి ఫర్ ఏ ఛేంజ్ అంటూ బంతిని చేతుల్లోకి తీసుకున్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. బ్రిస్బేన్ టెస్ట్‌కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్స్‌లో విరాట్ బౌలింగ్ చేశాడు. కొద్ది సేపు మీడియం పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అప్పుడప్పుడూ సరదాగా బౌలింగ్ చేసే కోహ్లీ.. ఈసారి బంతితో సీరియస్‌గా బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అతడి బౌలింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ కంగారూల ఖేల్ ఖతం అని అంటున్నారు.


కాస్కోండి..

నెట్స్‌లో ఒకవైపు బ్యాటింగ్‌లో అదరగొట్టిన కోహ్లీ.. మరోవైపు బంతితోనూ ప్రాక్టీస్ చేశాడు. దీంతో బ్రిస్బేన్ టెస్ట్‌లో విరాట్ ఆసీస్‌కు డబుల్ స్ట్రోక్ ఇవ్వడం గ్యారెంటీ అని అభిమానులు అంటున్నారు. కాస్కోండి.. కింగ్ వస్తున్నాడు అని సవాల్ విసురుతున్నారు. కాగా, పెర్త్ టెస్ట్‌లో సెంచరీతో చెలరేగి భారత్‌ భారీ విజయం అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడీ స్టార్ బ్యాటర్. దీంతో తిరిగి ఫామ్‌ అందుకున్నాడని అంతా మురిశారు. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఫెయిల్ అవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మూడో టెస్ట్‌లో గాడిన పడాలని భావిస్తున్న అతడు గానీ చెలరేగితే కమిన్స్ సేనకు మూడినట్లే అని చెప్పొచ్చు.


Also Read:

రోహిత్-కోహ్లీని మించిపోయిన హార్దిక్
ఫిక్సర్‌ థిల్లాన్‌పై ఆరేళ్ల నిషేధం

ఓదార్పయినా దక్కేనా..!

కెప్టెన్‌తో చెడిందా?
For More
Sports And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 11:26 AM