Share News

FIDE Title: 17 ఏళ్లకే చరిత్ర సృష్టించిన గుకేశ్..ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కైవసం

ABN , Publish Date - Apr 22 , 2024 | 08:02 AM

భారత్‌కు చెందిన 17 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ గుకేశ్(Gukesh) దొమరాజు ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ను(FIDE Candidates 2024 title) గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. కెనడాలోని టొరంటోలో జరిగిన ఉత్కంఠభరితమైన 14 రౌండ్ల అభ్యర్థుల చెస్(chess) టోర్నమెంట్ ముగింపులో ఈ యువకుడు 14లో 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

FIDE Title: 17 ఏళ్లకే చరిత్ర సృష్టించిన గుకేశ్..ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కైవసం
FIDE Candidates 2024 title won by 17 years D Gukesh

భారత్‌కు చెందిన 17 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ గుకేశ్(Gukesh) దొమరాజు ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ను(FIDE Candidates 2024 title) గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. కెనడాలోని టొరంటోలో జరిగిన ఉత్కంఠభరితమైన 14 రౌండ్ల అభ్యర్థుల చెస్(chess) టోర్నమెంట్ ముగింపులో ఈ యువకుడు 14లో 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఆదివారం అమెరికా గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురాతో జరిగిన తన చివరి రౌండ్ మ్యాచ్‌లో గుకేశ్ డ్రాగా ముగించారు. మరోవైపు గ్రాండ్‌మాస్టర్లు ఫాబియానో కరువానా, లాన్ నెపోమ్నియాచి మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. వారిద్దరూ కూడా 8.5 పాయింట్లకే పరిమితమయ్యారు. ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే, టొరంటో గ్రేట్ హాల్ అంతటా ఉత్సాహం కనిపించింది.

దీంతో ఈ ఏడాది చివరిలో ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ కోసం గుకేశ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌తో తలపడనున్నాడు. దీనిలో కూడా విజయం సాధిస్తే అతి చిన్న వయస్సులోనే ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించనున్నారు. మాగ్నస్ కార్ల్‌సెన్, గ్యారీ కాస్పరోవ్ ప్రపంచ ఛాంపియన్‌లుగా మారినప్పుడు వారి వయస్సు 22 కావడం విశేషం. ఈ సందర్భంగా విశ్వనాథన్ ఆనంద్(viswanathan anand) సహా పలువురు సోషల్ మీడియా(social media) వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

విశ్వనాథన్ ఆనంద్(2014) తర్వాత క్యాండిడేట్స్ చెస్ గెలిచిన రెండో భారతీయుడు గుకేశ్ కావడం విశేషం. అతని గురువు తర్వాత విజేతగా నిలిచిన మొదటి భారతీయుడు గుకేశ్ మాత్రమేనని చెప్పవచ్చు. అంతేకాదు గుకేశ్(Gukesh) చెస్ చరిత్రలోనే 12 ఏళ్ల వయస్సులోనే గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అతను గత సంవత్సరం హాంగ్‌జౌ ఆసియా క్రీడలలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ తేదీలు, వేదిక ఇంకా నిర్ణయించబడలేదు.

ఇది కూడా చదవండి:

అరెరె.. ఆర్సీబీ!

IPL 2024: ఐపీఎల్‌లో అరుదైన మైలురాయి చేరుకున్న దినేశ్ కార్తీక్

మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 22 , 2024 | 08:06 AM