Share News

మహనీయుల విగ్రహాలకు అవమానం

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:10 AM

నల్లజర్ల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామ పంచాయితీ పరిధిలోని గాంధీ కాలనీలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియన వ్యక్తులు అంబేడ్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేశారు. శనివారం ఉదయం చూసిన స్థానికులు మండలంలోని అంబేడ్కర్‌వాదులు, మాల మహానాడు నేతలకు సమాచారం తెలపడంతో వారు భారీ ఎత్తున తరలివచ్చి రాస్తారోకో నిర్వహించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు

మహనీయుల విగ్రహాలకు అవమానం
దూబచర్ల గాంధీ కాలనీలోని అంబేడ్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దృశ్యం

దూబచర్లలో అంబేడ్కర్‌ విగ్రహానికి

చెప్పుల దండ వేసిన గుర్తు తెలియని వ్యక్తులు

రాస్తారోకో నిర్వహించిన

అంబేడ్కర్‌వాదులు, మాల మహానాడు నేతలు

రంగంలోకి క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌

భారీ ఎత్తున పోలీసుల మోహరింపు

నల్లజర్ల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామ పంచాయితీ పరిధిలోని గాంధీ కాలనీలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియన వ్యక్తులు అంబేడ్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేశారు. శనివారం ఉదయం చూసిన స్థానికులు మండలంలోని అంబేడ్కర్‌వాదులు, మాల మహానాడు నేతలకు సమాచారం తెలపడంతో వారు భారీ ఎత్తున తరలివచ్చి రాస్తారోకో నిర్వహించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న ఆదనపు ఎస్పీ సుబ్బారాజు, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ సిబ్బందితో హూటహూటిన చేరుకుని క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపా రు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సంఘటనా స్థలానికి వచ్చి అంబేడ్కర్‌ను అవమానపరిచిన దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. రాస్తారోకో చేస్తున్న వారితో కలిసి రోడ్డుపై కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ విషయంపై మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అంబేడ్కర్‌ విగ్రహాన్ని చెప్పుల దండతో అవమానపర్చారని, అక్కడ నూతన విగ్రహాం ఏర్పాటు చేసి పైన షెల్టర్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే తామే ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం డీఎస్పీకి వినతి పత్రం అందించారు. గోపాలపురం జనసేన కన్వీనర్‌ దొడ్డిగర్ల సువర్ణరాజు మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించి శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. డీఎస్పీ, సీసీఎస్‌ సీఐ అనుకూరి శ్రీనివాస్‌, దేవరపల్లి సీఐ బియస్‌ నాయక్‌, నల్లజర్ల సీఐ విజయశంఖర్‌ అంబేడ్కర్‌వాదులతో చర్చలు జరిపి అంబే డ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల లు వేశారు. కార్యక్రమంలో బోడిగడ్ల వెంకటేశ్వరరావు, కూరపాటి శ్రీను, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు పిల్లి కాంతరావు, గుదే సుబ్బారావు, బొడిగడ్ల రాంబాబు, శ్రీరాములు, ఆదినారాయణ, కీర్తి రాజు పాల్గొన్నారు.

ముసుళ్లకుంటలో ఎన్టీఆర్‌ విగ్రహానికి చెప్పుల దండ

పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ముసుళ్లకుంటలో ఎన్టీఆర్‌ విగ్రహానికి అవమా నం జరిగింది. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. ఉదయం చూసిన గ్రామస్థులు, టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వెంటనే స్పందించి ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. గ్రామంలో గంజాయి బ్యాచ్‌ ఎక్కువగా ఉందని, మోటార్‌ వైర్లు, కోడిపుంజుల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిపై దృష్టి పెట్టాలని అక్కడకు వచ్చిన పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నందమూరి శారదదేవి, రామకృష్ణ, కాకర్ల శేషగిరి, బొలుసు గంగరాజు, బొలుసు సుబ్బారావు, అయినపూడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:10 AM