Surya kumar Yadav: రెండేళ్లుగా నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నా.. ఎలా ఆడాలో తెలుసు.. సూర్య కుమార్ కీలక వ్యాఖ్యలు!
ABN , Publish Date - Jun 19 , 2024 | 01:54 PM
టీ-20 ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్‌ను మించిన బ్యాటర్ లేడు. దాదాపు రెండేళ్లుగా ఐసీసీ ప్రకటిస్తున్న టీ-20 బ్యాటర్ల జాబితాలో సూర్య అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాంటి సూర్యపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
టీ-20 ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav)ను మించిన బ్యాటర్ లేడు. దాదాపు రెండేళ్లుగా ఐసీసీ ప్రకటిస్తున్న టీ-20 బ్యాటర్ల జాబితాలో సూర్య అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాంటి సూర్యపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ (T20 Worldcup)లో సూర్య అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. టీ-20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం 59 పరుగులు మాత్రమే చేశాడు.
మొత్తానికి లీగ్ దశలో మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమిండియా సూపర్-8 (Super-8) లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. తన ఫామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ``నేను రెండేళ్లుగా ప్రపంచ టీ-20 నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నా. నెంబర్ వన్ బ్యాటర్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలగాలి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినా సంయమనంతో తెలివిగా ఆడాలి. జట్టు కోసం పరుగులు చేయాలి. నేను కూడా అదే ట్రై చేస్తున్నా. బౌలర్లు మన ఆటను పూర్తిగా చదివినపుడు సవాళ్లు ఎదురవుతాయి.
బౌలింగ్‌కు పూర్తిగా సహకరిస్తున్న పిచ్‌పై బౌలర్లు చెలరేగుతున్నప్పుడు మనమేమీ చేయలేం. న్యూయార్క్‌లో ఆడడం ఇదే తొలిసారి. ఇక్కడి పిచ్ పూర్తిగా బౌలర్ల వైపే ఉంది. బ్యాటర్లకు సవాలుగా నిలిచింది. అయితే కీలక మ్యాచ్‌లు జరిగే వెస్టిండీస్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలుసు. అక్కడ ఆడిన అనుభవం మాకు ఉంది. న్యూయార్క్‌లో కంటే విండీస్‌లో మా బ్యాటర్లు మెరుగ్గా ఆడతారని నమ్మకం ఉంది`` అంటూ సూర్య పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
Kane Williamson: కెప్టెన్సీ నుంచి వైదొలగిన కేన్ విలియమ్సన్.. కారణమిదే!
Haris Rauf: అభిమానితో పాకిస్తాన్ క్రికెటర్ గొడవ.. చివరకు ఏమైందంటే?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..