భారత్‌దే జూనియర్ హాకీ ఆసియా కప్
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:39 AM
మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం చైనాతో జరిగిన ఈ ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్ ద్వారా..
ఫైనల్లో చైనాపై విజయం
మస్కట్: మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం చైనాతో జరిగిన ఈ ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్ ద్వారా 4-2 తేడాతో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. మొదట పెనాల్టీ స్ట్రోక్ ద్వారా చైనా గోల్ సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 41వ నిమిషంలో దీపిక గోల్‌తో భారత్ పోటీలోకి వచ్చింది. విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో భారత్ 4 గోల్స్ చేసి ఒక్కసారి మాత్రమే విఫలం కాగా.. అటు చైనా ప్రయత్నాలను గోల్‌కీపర్ నిధి అద్భుతంగా అడ్డుకోవడంతో కేవలం రెండు గోల్స్ చేసి నిరాశలో మునిగింది. కాగా భారత ప్లేయర్లకు తలా రెండేసి లక్షల నజరానాను హాకీ ఇండియా ప్రకటించింది.