పాక్‌పై భారత్ గెలుపు
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:30 AM
అండర్-19 ఆసియాక్‌పలో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 9 వికెట్లతో విజయం సాధించింది....
అండర్-19 ఆసియాకప్
కౌలాలంపూర్: అండర్-19 ఆసియాక్‌పలో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 9 వికెట్లతో విజయం సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో కోటీ 60 లక్షలతో అదరగొట్టిన ఓపెనర్ కమలిని (29 బంతుల్లో 44 నాటౌట్) అలరించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 67 పరుగులు చేసింది. సోనమ్ యాదవ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారత్ 7.5 ఓవర్లలోనే 68/1 స్కోరుతో మ్యాచ్‌ను ముగించింది. మరో ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు మలేసియాపై గెలిచింది.