Share News

Mahendra Singh Dhoni: ఆ కేసులో ధోనీకి హైకోర్టు నోటీసులు.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:08 PM

MS Dhoni-Jharkhand High Court: ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Mahendra Singh Dhoni: ఆ కేసులో ధోనీకి హైకోర్టు నోటీసులు.. అసలేం జరిగిందంటే..
MS Dhoni

MS Dhoni-Jharkhand High Court: ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ కేసుకు సంబంధించిన ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరి ధోనీకి ఏ కేసులో నోటీసులు జారీ చేశారు.. అసలేం జరిగింది.. కీలక వివరాలు మీకోసం..


ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనకు జార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది. తన వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇంతకీ కేసు ఏంటో తెలుసుకుందాం. మిహిర్ దివాకర్, సౌమ్య దాస్‌లు ‘ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్’ డైరెక్టర్లు. వీరు ధోనీ పేరుతో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు ధోనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తరువాత వీరితో ధోనీ తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు.


ధోనీతో ఒప్పందం రద్దు చేసుకున్నప్పటికీ.. తన పేరును వినియోగించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మిహిర్ దివాకర్, సౌమ్య దాస్‌లపై కేసు పెట్టారు. రూ. 15 కోట్లు మోసం చేశారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు ధోని. అయితే, ఈ కేసును సవాల్ చేస్తూ దివాకర్, దాస్‌లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ధోనీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తన వైఖరిని స్పష్టం చేయాలని ఆదేశించింది. మరి ధోని దీనిపై ఎలా స్పందిస్తాడనేది వేచి చూడాలి.


రూ. 4 కోట్లకే ధోనీ..

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2025) నెక్ట్స్ సీజన్‌లో ఆడనున్నాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు చైన్నై సూపర్ కింగ్స్ టీమ్.. ధోనీని రూ. 4 కోట్లకు రిటెయిన్ చేసుకుంది. అన్‌క్యాప్డ్ ప్లేయ్ కేటగిరిలో ధోనిని కొనసాగించింది. వాస్తవానికి 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా భారత్ తరఫున క్రికెట్ ఆడని ప్లేయర్లను అన్‌క్యాప్డ్ విభాగంలో ఉంచాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ నిబంధనను 2021లో రద్దు చేయగా.. ఇప్పుడు మళ్లీ అమల్లోకి తీసుకువచ్చారు. దీనిని యూజ్ చేసుకున్న చెన్నై.. ధోనీని కేవలం రూ. 4 కోట్లకే లాగేసుకుంది.


Also Read:

ఓటు హక్కు వినియోగించుకున్న ఎం‌ఎస్ ధోని

మాజీ మంత్రికి చెమటలు పట్టించిన పోలీసులు..

చనిపోయిన వారి శరీరం రంగు మారుతుంది ఎందుకు

For More Sports News and Telugu News..

Updated Date - Nov 13 , 2024 | 05:08 PM