Watch Video: క్లాసెన్ కొడితే అలాగే ఉంటుంది.. స్టేడియం అవతల పడిన బంతి.. కోహ్లీ రియాక్షన్ చూడండి..!
ABN , Publish Date - Apr 16 , 2024 | 11:36 AM
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. 31 బంతుల్లో 61 పరుగులు చేసి అభిమానులను ఉర్రూతలూగించాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH vs RCB) ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) విధ్వంసం సృష్టించాడు. 31 బంతుల్లో 61 పరుగులు చేసి అభిమానులను ఉర్రూతలూగించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో క్లాసెన్ కొట్టిన ఓ సిక్సర్ దెబ్బకు బంతి స్టేడియం అవతల పడింది (IPL 2024).
31 బంతులు ఆడిన క్లాసెన్ 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఫెర్గూసన్ వేసిన రెండో బంతిని క్లాసెన్ ఆన్ సైడ్ భారీ సిక్స్‌గా మలిచాడు. ఆ దెబ్బకు బంతి స్టేడియం పై కప్పు పై నుంచి వెళ్లి అవతల పడింది. దాదాపు 106 మీటర్ల దూరం వెళ్లింది (Klaasen Sixer). ఆ భారీ సిక్స్ చూసి కోహ్లీ (Virat Kohli) షాక్‌కు గురయ్యాడు. చాలా నిర్వేదంగా, డల్‌గా మాక్స్‌వెల్‌తో మాట్లాడుతూ ఉండిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రావిస్ హెడ్ (41 బంతుల్లో 102), క్లాసెన్ (31 బంతుల్లో 67) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. రికార్డు ఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సైతం పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో సన్‌రైజర్స్ 25 పరుగుల తేడాతో నెగ్గింది. రైజర్స్‌కిది హ్యాట్రిక్ గెలుపు కాగా, ఆర్‌సీబీకి వరుసగా ఐదో ఓటమి.
ఇవి కూడా చదవండి..
IPL 2024: సెంచరీ చేసినా.. బ్యాట్ పైకి లేపలేదు.. రోహిత్‌పై బ్రెట్ లీ ప్రశంసలు
MS Dhoni: ధోనీ హ్యాట్రిక్ సిక్సుల మోత.. మైదానంలో నేహా ధూపియా కేరింత
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..