Share News

MS Dhoni: ధోనీ కుమార్తె జీవా చదువుతున్న స్కూల్ ఏంటో తెలుసా? ఆ స్కూల్ ఫీజు, ఇతర వివరాలు తెలిస్తే..

ABN , Publish Date - Sep 21 , 2024 | 01:40 PM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ సుదీర్ఘంగా సాగింది. అంతర్జాతీయ ఆటగాడిగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎప్పుడూ లైమ్‌లైట్‌లోనే ఉన్న ధోనీ ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించాడు.

MS Dhoni: ధోనీ కుమార్తె జీవా చదువుతున్న స్కూల్ ఏంటో తెలుసా? ఆ స్కూల్ ఫీజు, ఇతర వివరాలు తెలిస్తే..
MS Dhoni with his family

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కెరీర్ సుదీర్ఘంగా సాగింది. అంతర్జాతీయ ఆటగాడిగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎప్పుడూ లైమ్‌లైట్‌లోనే ఉన్న ధోనీ ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఎన్ని ఆస్తులు ఉన్నా ఎప్పుడూ సింపుల్‌గా కనిపించే ధోనీ తన కూతురిని మాత్రం స్థానికంగా ప్రఖ్యాత స్కూల్‌లో చదివిస్తున్నాడు. 6 ఫిబ్రవరి 2015లో పుట్టిన జీవా (Ziva)ప్రస్తుతం రాంచీలో ప్రతిష్ఠాత్మక టౌరియన్ వరల్డ్ స్కూల్‌లో చదువుకుంటోంది. ఈ స్కూలును అమిత్ బజ్లా 2008లో స్థాపించారు.


రాంచీలో మొత్తం 65 ఎకరాల్లో టౌరియన్ వరల్డ్ స్కూల్‌ను (Taurian World School) నిర్మించారు. ఈ స్కూల్ ఫౌండర్ అయిన అమిత్ బజ్లా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుకున్నారు. ఈ స్కూల్‌లో సాంప్రదాయ విద్యతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్, హార్స్ రైడింగ్, శారీరక, మానసిక శ్రేయస్సు, ఆటలతోపాటు మరెన్నో నేర్పిస్తారు. ఈ స్కూల్‌లో అంతర్జాతీయ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అకడమిక్ ఎక్స్‌లెన్స్ మాత్రమే కాకుండా సృజనాత్మక, విమర్శనాత్మక ఆలోచనను, భావోద్వేగ మేధస్సును పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించారు. విద్యార్థి కేంద్రకంగా ఇక్కడ విద్యా వ్యవస్థ ఉంటుంది.


ఈ స్కూల్‌లో చదవాలంటే మాత్రం ఫీజు కాస్త గట్టిగా సమర్పించుకోవాల్సిందే. ఈ స్కూలులో ఎల్‌కేజీ నుంచి 8వ తరగతి వరకు రూ. 4.40 లక్షలు వసూలు చేస్తారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రూ. 4.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కూల్‌లో విద్యార్థులకు క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ మొదలైన అంశాలపై లైఫ్ స్కిల్స్‌ను కూడా బోధిస్తారట.

ఇవి కూడా చదవండి..

Rohit Sharma: గిల్‌పై రోహిత్ శర్మ ఫ్రాంక్.. కోహ్లీ చెప్పిన మాటతో నవ్వులే నవ్వులు.. వీడియో వైరల్..


Watch Video: మలింగలా బౌలింగ్ చేస్తున్నావు.. షకిబ్‌ బంతులపై కోహ్లీ కామెంట్.. వీడియో వైరల్..


Test Match : బంగ్లా ఢమాల్‌


Ind vs Ban: బంగ్లాదేశ్ మరో తప్పిదం.. ఐసీసీ నుంచి జరిమానా తప్పదా..?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 21 , 2024 | 01:41 PM