Share News

T20 Worldcup: వారం ముందే బర్త్‌డే గిఫ్ట్.. నా హార్ట్ రేట్ పెరిగిపోయింది.. టీమిండియా విజయంపై ధోనీ స్పందన!

ABN , Publish Date - Jun 30 , 2024 | 09:34 AM

ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం కోట్లాది మందిని భావోద్వేగానికి గురి చేసింది. చివరి వరకు పట్టు వదలకుండా పోరాడిన టీమిండియాపై అభిమానులు, మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

T20 Worldcup: వారం ముందే బర్త్‌డే గిఫ్ట్.. నా హార్ట్ రేట్ పెరిగిపోయింది.. టీమిండియా విజయంపై ధోనీ స్పందన!
Dhoni praises Teamindia

ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ (T20 World Cup) మ్యాచ్‌లో టీమిండియా విజయం కోట్లాది మందిని భావోద్వేగానికి గురి చేసింది. చివరి వరకు పట్టు వదలకుండా పోరాడిన టీమిండియాపై అభిమానులు, మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు (T20 World Cup Final). మరి, టీమిండియాకు తొలి టీ20 ప్రపంచకప్ అందించిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) స్పందన ఏంటి? టీమిండియా రెండో టీ20 ప్రపంచకప్ విజయంపై ధోనీ ఎలా స్పందించాడంటే..


టీమిండియా విజయం తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ధోనీ ఓ పోస్ట్ పెట్టాడు. ``ప్రపంచకప్ 2024 ఛాంపియన్స్. ఈ మ్యాచ్ సమయంలో నా హార్ట్ రేట్ పెరిగిపోయింది. చాలా సైలెంట్‌గా విజయం సాధించారు. ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయం దక్కించుకున్నారు. ప్రపంచకప్‌ను స్వదేశానికి తీసుకొస్తున్న మిమ్మల్ని చూసి ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతాడు. కంగ్రాట్స్ బాయ్స్. నాకు విలువ కట్టలేని బర్త్ డే గిఫ్ట్ అందించినందుకు ధన్యవాదాలు`` అంటూ ధోనీ కామెంట్ చేశాడు.


ధోనీ పోస్ట్‌పై అతడి అభిమానులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ధోనీ బర్త్ డే జులై 7. అతడి జెర్సీ నెంబర్ కూడా 7. దక్షిణాఫ్రికాపై టీమిండియా 7 పరుగుల తేడాతోనే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నెట్టింట ధోనీ అభిమానుల సందడికి హద్దే లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: ``ఈ మనిషి నా సొంతం అయినందుకు``.. విరాట్ కోహ్లీపై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్!


T20 Worldcup: ఓటమి తప్పదనుకునే దశలో హార్దిక్ ఏం చేశాడో చూడండి.. క్లాసెన్ అవుట్ టర్నింగ్ పాయింట్!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 30 , 2024 | 09:34 AM