హోటల్‌లో సర్వర్‌గా ఒలింపిక్ పతక విజేత!
ABN , Publish Date - Aug 21 , 2024 | 06:01 AM
పారిస్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన తర్వాత పోడియంపై నిల్చొని అమాయకంగా పతకాన్ని ముద్దాడిన వీడియోతో వైరల్ అయిన 18 ఏళ్ల చైనా జిమ్నాస్ట్ ఝౌ యాకిన్.. మరోసారి నెట్‌లో హల్‌చల్ చేస్తోంది...
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన తర్వాత పోడియంపై నిల్చొని అమాయకంగా పతకాన్ని ముద్దాడిన వీడియోతో వైరల్ అయిన 18 ఏళ్ల చైనా జిమ్నాస్ట్ ఝౌ యాకిన్.. మరోసారి నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఒలింపిక్ యూనిఫాంలో ఓ రెస్టారెంట్‌లో సర్వ్ చేస్తున్న ఆమె వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. హెంగ్‌యాంగ్ సిటీలో ‘ఫ్యాట్ బ్రదర్’ పేరుతో యాకిన్ తల్లిదండ్రులు రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో విశ్వక్రీడలు ముగిసిన తర్వాత ఇంటి చేరుకున్న యాకిన్ తల్లిదండ్రులకు సహాయంగా కస్టమర్లకు సర్వ్ చేస్తోంది. ఇలా.. ఆటను, కుటుంబ బాధ్యతలను చక్కగా బ్యాలెన్స్ చేస్తోన్న యాకిన్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. పారిస్ క్రీడల్లో బ్యాలెన్సింగ్ బీమ్‌లో దిగ్గజం సిమోన్ బైల్స్ లాంటి వారితో పోటీపడి యాకిన్ రెండో స్థానంలో నిలిచింది. పతక ప్రదానం సందర్భంగా స్వర్ణం, కాంస్యం గెలిచిన ఇటలీ జిమ్నా్‌స్టలు అలీస్ డిమాంటో, మనీలా ఎస్పోసిటోలు పతకాన్ని కొరికి సందడి చేస్తుంటే..
ఆశ్చర్యంగా వారివైపు చూసిన యాకిన్, పతక విజేతలు ఇలాగే చేయాలేమో అనుకొని పతకం నోటి దగ్గర పెట్టుకొని ఫొటోలకు ఫోజులివ్వడం అందరినీ ఆకట్టుకుంది.