Share News

Rashid Khan: ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన రాత్రి నిద్ర లేదు.. అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కామెంట్స్!

ABN , Publish Date - May 08 , 2024 | 05:21 PM

గతేడాది అక్టోబర్‌లో జరిగిన ప్రపంచకప్‌లో పసికూన అఫ్గానిస్తాన్ సాధించిన సంచలన విజయాలు క్రికెట్ ప్రేమికులను నివ్వెరపరిచాయి. ఆస్ట్రేలియా మీద గెలిచినంత పని చేసి ఓడిన అఫ్గానిస్తాన్.. పాకిస్తాన్‌ మీద సునాయాసంగా గెలిచేసింది. ఇంగ్లండ్‌పై కూడా విజయం సాధించింది.

Rashid Khan: ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన రాత్రి నిద్ర లేదు.. అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కామెంట్స్!
Rashid Khan

గతేడాది అక్టోబర్‌లో జరిగిన ప్రపంచకప్‌లో (2023 World Cup) పసికూన అఫ్గానిస్తాన్ (Afghanistan) సాధించిన సంచలన విజయాలు క్రికెట్ ప్రేమికులను నివ్వెరపరిచాయి. ఆస్ట్రేలియా మీద గెలిచినంత పని చేసి ఓడిన అఫ్గానిస్తాన్.. పాకిస్తాన్‌ (Pakistan) మీద సునాయాసంగా గెలిచేసింది. ఇంగ్లండ్‌పై కూడా విజయం సాధించింది. ఇక, శ్రీలంక్, నెదర్లాండ్స్‌పై కూడా విజయాలు సాధించింది. అయితే పాకిస్తాన్ మీద సాధించిన విజయం అఫ్గాన్ క్రికెటర్లకు గొప్ప కిక్ ఇచ్చిందట. ఆ దేశ స్పన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) తాజాగా అప్పటి విజయం గురించి మాట్లాడాడు.


``పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ రాత్రంతా సంతోషంతో డ్యాన్స్‌లు వేస్తూనే ఉన్నా. విజయం సాధించిన తర్వాత గ్రౌండ్ నుంచి హోటల్ వరకు సెలబ్రేట్ చేసుకున్నాం. అర్ధరాత్రి దాటిన మా సంబరాలు ఆగలేదు. అప్పటికి వెన్ను నొప్పితో బాధపడుతున్న నేను కూడా విపరీతంగా డ్యాన్స్‌లు వేశా. జాగ్రత్తగా ఉండాలని మా ఫిజయో హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా నేను ఆగలేదు. నా డ్యాన్స్‌లు చూసి మా టీమ్ మొత్తం ఆశ్చర్యపోయింద``ని రషీద్ తెలిపాడు.


ఆ మ్యాచ్‌లో అఫ్గాన్ బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్ (87), గుర్భాజ్ (65), రెహమత్ షా (77) అద్భుతంగా బ్యాటింగ్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. అఫ్గాన్ బౌలర్ నూర్ అహ్మద్ చెలరేగి మూడు వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ వికెట్లేమీ తియకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసి పరుగులను నియంత్రించాడు. ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన అఫ్గానిస్తాన్ ఛాంపియన్స్ ట్రోపీ-2025కి నేరుగా అర్హత సాధించింది.

ఇవి కూడా చదవండి..

T20 Worldcup: నా సలహా వాళ్లకు నచ్చకపోవచ్చు, కానీ టీమిండియాకు అతడే కీలకం: బ్రియాన్ లారా


IPL 2024: సంజు శాంసన్‌కు ఫైన్.. ఎందుకంటే..?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2024 | 05:21 PM