Share News

Ravichandran Ashwin : అశ్విన్‌ భార్య భావోద్వేగం

ABN , Publish Date - Dec 22 , 2024 | 06:41 AM

అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్‌ వీడ్కోలు పలకడంపై అతడి భార్య ప్రీతి భావోద్వేగంతో స్పందించింది. ‘గత రెండు రోజులుగా ఏమీ అర్థం

Ravichandran Ashwin : అశ్విన్‌ భార్య భావోద్వేగం

అంతా అగమ్యగోచరంగా ఉంది

చెన్నై: అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్‌ వీడ్కోలు పలకడంపై అతడి భార్య ప్రీతి భావోద్వేగంతో స్పందించింది. ‘గత రెండు రోజులుగా ఏమీ అర్థం కాకుండా అంతా అగమ్యగోచరంగా ఉంది. అసలేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. గత 13-14 ఏళ్లుగా ఎన్నో అనుభవాలు చవిచూశాం. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌, ఎంసీజీలో విజయం, సిడ్నీ టెస్టు డ్రా, గాబాలో వీరోచిత విజయంతో పాటు టీ20ల్లో పునరాగమనం వల్ల మేం పొందిన ఆనందం అనిర్వచనీయం. నాకు క్రికెట్‌ను పరిచయం చేసింది నువ్వే. ఈ ఆట పట్ల ప్రేమను కలిగించావు. ఇక నీకిష్టమైన రీతిలో కొత్త జీవితాన్ని గడుపు’ అని అశ్విన్‌కు సూచించింది.

Updated Date - Dec 22 , 2024 | 06:42 AM