Share News

సచిన్‌ టెండూల్కర్‌ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

ABN , Publish Date - May 16 , 2024 | 04:48 AM

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు సెక్యూరిటీ గార్డుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర రిజర్వ్‌ పోలీసు విభాగం (ఎస్‌ఆర్‌పీఎ్‌ఫ)కు చెందిన జవాను ఆత్మహత్య చేసుకోవడం...

సచిన్‌ టెండూల్కర్‌ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

ముంబై: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు సెక్యూరిటీ గార్డుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర రిజర్వ్‌ పోలీసు విభాగం (ఎస్‌ఆర్‌పీఎ్‌ఫ)కు చెందిన జవాను ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. 39 ఏళ్లప్రకాశ్‌ కాప్డే అనే గార్డు తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సెలవుపై తన స్వస్థలమైన మహారాష్ట్రలోని జామ్నర్‌కు వెళ్లిన ప్రకాశ్‌ అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. వ్యక్తిగత కారణాల రీత్యానే ఆ జవాను ఆత్మహత్మకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - May 16 , 2024 | 04:48 AM