Share News

Sri Lanka VS New Zealand: న్యూజిలాండ్‌కు శ్రీలంక భారీ షాక్.. క్రికెట్ చరిత్రలోనే మూడో భారీ ఫాలో ఆన్..

ABN , Publish Date - Sep 28 , 2024 | 02:26 PM

అగ్రశ్రేణి జట్టుగా కొనసాగుతున్న న్యూజిలాండ్‌కు శ్రీలంక క్రికెట్ టీమ్ కోలుకోలేని షాకిచ్చింది. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో చెలరేగుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్ గెలిచిన శ్రీలంక ప్రస్తుతం గాలేలో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ రెచ్చిపోతోంది.

Sri Lanka VS New Zealand: న్యూజిలాండ్‌కు శ్రీలంక భారీ షాక్.. క్రికెట్ చరిత్రలోనే మూడో భారీ ఫాలో ఆన్..
Sri Lanka cricket team

అగ్రశ్రేణి జట్టుగా కొనసాగుతున్న న్యూజిలాండ్‌ (New Zealand )కు శ్రీలంక (Sri Lanka) క్రికెట్ టీమ్ కోలుకోలేని షాకిచ్చింది. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో చెలరేగుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్ గెలిచిన శ్రీలంక ప్రస్తుతం గాలేలో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ రెచ్చిపోతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 602 పరుగుల భారీ స్కోరు సాధించిన శ్రీలంక.. కివీస్‌ను మాత్రం 88 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో శ్రీలంకకు 514 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది (Sri Lanka VS New Zealand).


లంక బౌలర్ ప్రభాత్ జయసూర్య (42/6) ధాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు విలవిలలాడారు. 39.5 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌట్ అయ్యారు. మిచెల్ సాంట్నర్ (29) కాసేపు పోరాడడంతో న్యూజిలాండ్ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. మొత్తం 18 ఓవర్లు వేసిన జయసూర్య ఆరు మెయిడన్లతో 42 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. టెస్ట్‌ల్లో ఐదేసి వికెట్లు తీయడం జయసూర్యకు ఇది 9వ సారి. కాగా, ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న గాలేలో జయసూర్య ఈ ఫీట్ సాధించడం 8వసారి కావడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దక్కించుకున్న శ్రీలంక.. న్యూజిలాండ్‌ను ఫాలో ఆన్ ఆడించాలని నిర్ణయించుకుంది.


ఏకంగా 514 పరుగుల లోటుతో న్యూజిలాండ్ ఫాలో ఆన్ బరిలోకి దిగింది. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది మూడో భారీ ఫాలో ఆన్ కావడం గమనార్హం. 1938లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఏకంగా 702 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇక, 2002లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ 570 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత ప్రస్తుత మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. కాగా, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ సున్నా పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ టామ్ లాథమ్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. లంచ్ సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 3 పరుగులతో ఆడుతోంది.

ఇవి కూడా చదవండి..

Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్‌లో అరుదైన ఘటన.. భారత జాతీయ పతాకాన్ని పట్టుకున్న పాక్ చెస్ ప్లేయర్లు..


వరుణుడిదే ఆధిపత్యం


12 ఏళ్ల క్రితం పోటీపడింది.. ఇప్పుడు పతకం సొంతమైంది


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 28 , 2024 | 02:26 PM