Share News

అండర్‌-19 ప్రపంచకప్‌కు త్రిష, షబ్నమ్‌

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:19 AM

కౌలాలంపూర్‌లో వచ్చేనెల 18 నుంచి జరిగే అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచక్‌పలో పోటీపడే భారత జట్టును మంగళవారం ప్రకటించారు. నిక్కీ ప్రసాద్‌ సారథ్యంలోని...

అండర్‌-19 ప్రపంచకప్‌కు త్రిష, షబ్నమ్‌

న్యూఢిల్లీ: కౌలాలంపూర్‌లో వచ్చేనెల 18 నుంచి జరిగే అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచక్‌పలో పోటీపడే భారత జట్టును మంగళవారం ప్రకటించారు. నిక్కీ ప్రసాద్‌ సారథ్యంలోని 15 మంది సభ్యుల ఈ జట్టులో తెలుగమ్మాయిలు గొంగడి త్రిష, మహ్మద్‌ షబ్నమ్‌, కేసరి ధృతి ఎంపికయ్యారు. భద్రాచలంకు చెందిన బ్యాటర్‌ త్రిష.. గతవారం అండర్‌-19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. ఇక, విశాఖపట్నానికి చెందిన షబ్నమ్‌ ఇప్పటికే జూనియర్‌ స్థాయిలో వివిధ టోర్నీల్లో సత్తా చాటుకుంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడనున్న ఈ ప్రపంచకప్‌ ఫైనల్‌ ఫిబ్రవరి రెండున జరగనుంది. భారత్‌.. ఆతిథ్య మలేసియా, వెస్టిండీస్‌, శ్రీలంకతో కలిసి గ్రూప్‌-ఎ నుంచి బరిలోకి దిగుతోంది.

Updated Date - Dec 25 , 2024 | 04:19 AM