Share News

Virat Kohli: కోహ్లీని విమర్శిస్తే మరింత ప్రమాదకారి అవుతాడు.. ప్రపంచకప్‌లో కోహ్లీనే కీలకం: మాథ్యూ హెడెన్

ABN , Publish Date - May 12 , 2024 | 07:33 PM

ప్రస్తుత ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ రాబోయే ప్రపంచకప్‌లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియాకు తిరుగు ఉండదని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేయాలని సూచించాడు.

Virat Kohli: కోహ్లీని విమర్శిస్తే మరింత ప్రమాదకారి అవుతాడు.. ప్రపంచకప్‌లో కోహ్లీనే కీలకం: మాథ్యూ హెడెన్
Virat Kohli

ప్రస్తుత ఐపీఎల్‌ (IPL 2024)లో అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli) రాబోయే ప్రపంచకప్‌లో (T20 Worldcup) కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియాకు తిరుగు ఉండదని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ (Matthew Hayden) అభిప్రాయపడ్డాడు. యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేయాలని, వీరిద్దరి కాంబినేషన్ టీమిండియాకు బెస్ట్ ఓపెనింగ్ జోడీ అవుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. 12 మ్యాచ్‌ల్లో 153 స్ట్రైక్ రేట్‌తో 70కి పైగా యావరేజ్‌తో 634 పరుగులు చేశాడు.


``రాబోయే ప్రపంచకప్‌లో కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి. సూర్య కుమార్ యాదవ్ మూడో స్థానంలో, రోహిత్ ఫోర్త్ ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దిగాలి. పవర్ ప్లేలో కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడి స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందని వచ్చిన విమర్శలను విన్నాను. కోహ్లీ క్లాస్ ఆటగాడు. టెక్నికల్‌గా అతడికి తిరుగు లేదు. అందుకే అన్ని ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేయగలుగుతున్నాడు. చివరి వరకు పట్టుదలగా విజయం కోసం ప్రయత్నించడం కోహ్లీలోని మరో గొప్ప లక్షణం`` అని హెడెన్ ప్రశంసించాడు.


కోహ్లీ తనపై వచ్చిన విమర్శలను సీరియస్‌గా తీసుకుంటాడని, వాటికి బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడని హెడెన్ అన్నాడు. విమర్శలు ఎదుర్కొనే కొద్దీ కోహ్లీలోని ఉత్తమ ఆటగాడు బయటకు వస్తాడని అన్నాడు. వచ్చే ప్రపంచకప్‌లో కోహ్లీయే టీమిండియాకు కీలక ఆటగాడని, ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియాకు టైటిల్ ఖాయం అని అన్నాడు. కోహ్లీ, జైస్వాల్, సూర్య, రోహిత్‌తో కూడా టాపార్డర్‌ను ఎదుర్కోవడం ఏ బౌలర్‌కైనా ఇబ్బందేనని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

Rishabh Pant: డీసీకి భారీ దెబ్బ.. రిషభ్ పంత్‌పై ఓ మ్యాచ్ నిషేధం.. కారణమిదే!


T20 World Cup: ప్రపంచకప్‌లో కోహ్లీని అలా ఉపయోగించుకోవాలి.. ఆ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు: గంగూలీ


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 12 , 2024 | 07:33 PM