Share News

Honor X9b: 108 మెగాపిక్సెల్ కెమెరాతో మార్కెట్లోకి హానర్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు చుశారా?

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:59 PM

కొత్తగా మంచి కెమెరా ఉన్న మొబైల్ కొనుగోలు చేయాలని చుస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు(ఫిబ్రవరి 15న) మార్కెట్లోకి Honor X9b స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. అయితే దీని ధర ఎంత, ఫీచర్లు ఎంటనేది ఇప్పుడు చుద్దాం.

Honor X9b: 108 మెగాపిక్సెల్ కెమెరాతో మార్కెట్లోకి హానర్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు చుశారా?

కొత్తగా మంచి కెమెరా ఉన్న మొబైల్ కొనుగోలు చేయాలని చుస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు(ఫిబ్రవరి 15న) మార్కెట్లోకి Honor X9b స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. అయితే దీని ధర ఎంత, ఫీచర్లు ఎంటనేది ఇప్పుడు చుద్దాం. ఇది 6.78 అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో 35W వైర్డు ఛార్జింగ్‌ సపోర్టుతో లభిస్తుంది. ఇది దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP53 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.


ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAMతో జతచేయబడిన 4nm స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్‌తో పనిచేస్తుంది. 12 GB RAM, 256 GB వరకు అంతర్గత నిల్వను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఇది డ్యూయల్ సిమ్ 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.1 GPS, భద్రత కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అనేక ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.

ఇక దీని రేటు విషయానికి వస్తే భారతదేశంలో Honor X9b ధర రూ. 25, 999గా ప్రకటించారు. ఈ ఫోన్ 8GB+256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇక కంపెనీ సమాచారం ప్రకారం Honor X9b ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఇతర స్టోర్లలో విక్రయించబడుతోంది. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ICICI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి రూ.3,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.

Updated Date - Feb 15 , 2024 | 03:59 PM