YouTube and Spotify: యూట్యూబ్, స్పాటిఫై యాప్స్ ఈ డివైజ్‌లో బ్యాన్!
ABN , Publish Date - Jan 19 , 2024 | 03:05 PM
గూగుల్‌కు చెందిన యూట్యూబ్, స్పాటిఫై యాప్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందాయి. అయితే ఈ రెండు యాప్స్ ప్రముఖ టెక్ సంస్థ Apple Inc రాబోయే రియాలిటీ హెడ్‌సెట్ విజన్ ప్రోలో అందుబాటులో లేవు.
గూగుల్‌కు చెందిన యూట్యూబ్, స్పాటిఫై యాప్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందాయి. అయితే ఈ రెండు యాప్స్ ప్రముఖ టెక్ సంస్థ Apple Inc రాబోయే రియాలిటీ హెడ్‌సెట్ విజన్ ప్రోలో అందుబాటులో లేవు. యూట్యూబ్ ప్రతినిధి జెస్సికా గిబ్బి ఈ మేరకు వివరాలను వెల్లడించారు. అయితే యాపిల్ విజన్ ప్రో కోసం కొత్త యాప్ తయారు చేస్తుందని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Ayodhya Rama Mandar: ఉచితంగా శ్రీరాముడి టాటూలు..
ఈ క్రమంలో విజన్ ప్రోలో కంటెంట్‌ని చూడటానికి వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించాలని యూట్యూబ్ తెలిపింది. వినియోగదారులు విజన్ ప్రోలో సఫారిలో యూట్యూబ్‌ని ఉపయోగించవచ్చని వెల్లడించారు యూట్యూబ్ ప్రతినిధులు. దీంతోపాటు వెబ్‌బ్రౌజర్ ద్వారా Spotifyని కూడా ఉపయోగించవచ్చని అంటున్నారు. ప్రధానంగా Apple ఈ పరికరాన్ని వీడియో గేమ్‌లు, వినోదం కోసం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే భవిష్యత్తులో విజన్ ప్రోకు మద్దతు ఇవ్వడాన్ని YouTube తోసిపుచ్చనప్పటికీ ఈ సమయంలో భాగస్వామ్యం చేయడానికి తదుపరి ప్రణాళికలు లేవని Apple పేర్కొంది. అయినప్పటికీ విజన్ ప్రోలో ఆపిల్ సంగీతం, ఇతర పాడ్‌కాస్ట్ యాప్‌లు ఉంటాయని..అవి స్పాటిఫైతో పోటీపడతాయని అన్నారు.