Share News

Drug Quality: 53 ఔషధాల్లో నాణ్యతా లోపాలు..

ABN , Publish Date - Sep 26 , 2024 | 04:26 AM

పారాసిటమాల్‌, కాల్షియం, విటమిన్‌ సీ, డీ3, యాంటీ బయాటిక్‌, మధుమేహం, రక్తపోటు (బీపీ) టాబ్లెట్లు సహా 53 రకాల ఔషధాలు నాణ్యతా పరీక్షల్లో విఫలమయ్యాయి.

Drug Quality: 53 ఔషధాల్లో నాణ్యతా లోపాలు..

  • జాబితాలో పారాసిటమాల్‌, విటమిన్‌, మధుమేహ ఔషధాలు

  • సీడీఎస్‌సీవో వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: పారాసిటమాల్‌, కాల్షియం, విటమిన్‌ సీ, డీ3, యాంటీ బయాటిక్‌, మధుమేహం, రక్తపోటు (బీపీ) టాబ్లెట్లు సహా 53 రకాల ఔషధాలు నాణ్యతా పరీక్షల్లో విఫలమయ్యాయి. భారత ఔషధ రంగ నియంత్రణ మండలి (సీడీఎ్‌ససీవో) ఈ ఔషధాలను నాణ్యతా ప్రమాణాలు లోపించిన ఔషధాల జాబితాలో చేర్చింది. హైదరాబాద్‌కు చెందిన హెటిరో డ్రగ్స్‌, ఆల్కెమ్‌ ల్యాబొరేటరీస్‌, హిందుస్థాన్‌ యాంటీబయాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), కర్ణాటక యాంటీబయాటిక్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌, మెగ్‌ లైఫ్‌ సైన్సెస్‌, ప్యూర్‌ అండ్‌ క్యూర్‌ హెల్త్‌కేర్‌ తదితర కంపెనీలు ఈ నాసిరకం ఔషధాలను తయారు చేశాయని నియంత్రణ మండలి తన నివేదికలో తెలిపింది.


సీడీఎ్‌ససీవో మార్కెట్లో విక్రయిస్తున్న ఔషధాల శాంపిళ్లను సేకరించి పరీక్షలను నిర్వహిస్తుంటుంది. ఈ 53 ఔషధాల్లో విటమిన్‌ సీ, డీ 3 టాబ్లెట్‌ షెల్‌కాల్‌, విటమిన్‌ బీ కాంప్లెక్స్‌, విటమిన్‌ సీ సాఫ్ట్‌జెల్స్‌, యాంటాసిడ్‌ పాన్‌-డీ, పారాసిటమాల్‌ ఐపీ 500 టాబ్లెట్లు, డయాబెటిక్‌ ఔషధం గ్లిమిపిరైడ్‌, బీపీ ఔషధం టెల్‌మిసార్టాన్‌ ఉన్నాయి. అలాగే హెటిరో తయారు చేసిన సిపోడెమ్‌ ఎక్స్‌పీ 50 డ్రై సస్పెన్షన్‌ ఔషధంలో కూడా నాణ్యతా ప్రమాణాలు లోపించినట్లు సీడీఎ్‌ససీఓ గుర్తించింది.

Updated Date - Sep 26 , 2024 | 04:26 AM