Share News

Hyderabad: గ్రూప్‌-1 మెయిన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 18 , 2024 | 04:13 AM

ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు.

Hyderabad: గ్రూప్‌-1 మెయిన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

  • సీఎస్‌ శాంతికుమారి.. 31,383 మంది అభ్యర్థులు.. 46 పరీక్షా కేంద్రాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. ఆమె గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీసు కమీషనర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం నుంచి చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి, సభ్యులు, సచివాల యం నుంచి డీజీపీ జితేందర్‌, కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌, ఎస్పీడీసీఎల్‌ ఎండీ ము ష్రాఫ్‌ అలీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కర్ణన్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్లు అనుదీప్‌, శశాంక్‌, గౌతమ్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.


సీఎస్‌ శాంతికుమారి మాట్లాడుతూ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతుండగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పరీక్షల్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ అంశంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని నికోలస్‌ స్పష్టం చేశారు. దివ్యాంగులకు గంట అదనంగా కేటాయిస్తామన్నారు.


  • వందలాది మంది అభ్యర్థుల ఆందోళన

గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేసి, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వందలాదిమంది అభ్యర్థులు గాంధీనగర్‌ కెనరా బ్యాంక్‌ పార్కులో ఆందోళన చేపట్టారు. ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్లు పాటించాలని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ఉన్నా పాటించలేదని, వెంటనే రిజర్వేషన్లు పాటించాలని డిమాండ్‌ చేశారు. పోలీసు లు 20 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని బండ్లగూడ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. కాగా, పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ అశోక్‌నగర్‌ చౌరస్తాలో అభ్యర్థులు గురువారం రాత్రి మెరుపు ధర్నా నిర్వహించారు.


  • హైకోర్టులో అప్పీలు

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీలో తప్పులు ఉన్నాయని, అందువల్ల ఆ పరీక్షను రద్దు చేసి మెయిన్స్‌ పరీక్ష నిర్వహించకుండా అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో గురువారం అప్పీలు దాఖలైంది. ఫైనల్‌ కీలో తప్పులు ఉండటంతోపాటు వివిధ కారణాలతో ప్రాథమిక పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సింగిల్‌ జడ్జి ధర్మాసనం మంగళవారం కొట్టేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం నష్కల్‌కు చెందిన గంగుల దామోదర్‌ రెడ్డి సహా ఐదుగురు అభ్యర్థులు అప్పీలు దాఖలు చేశారు. ఈ అప్పీలు శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.


  • ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..

- మహే్‌షకుమార్‌ గౌడ్‌ హామీ

గ్రూప్‌-1 అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ హామీ ఇచ్చారు. అభ్యర్థు లు గాంధీభవన్‌లో ఆయనతో భేటీ అయ్యారు.

Updated Date - Oct 18 , 2024 | 04:13 AM