Asaduddin Owaisi: ‘అసద్’ ప్రచారం ఆరంభం.. కార్యకర్తలతో కలిసి ఒవైసీ పాదయాత్ర
ABN , Publish Date - Apr 13 , 2024 | 10:02 AM
రంజాన్ మాసం ముగియడంతో మజ్లిస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) వందలాది మంది కార్యకర్తలను వెంట తీసుకుని బహదూర్‌పురా(Bahadurpura) శాసనసభ నియోజకవర్గంలోని కామాటిపురా, ఉస్మాన్‌బాగ్‌లతో పాటు బొందలగూడ ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు.
హైదరాబాద్: రంజాన్ మాసం ముగియడంతో మజ్లిస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) వందలాది మంది కార్యకర్తలను వెంట తీసుకుని బహదూర్‌పురా(Bahadurpura) శాసనసభ నియోజకవర్గంలోని కామాటిపురా, ఉస్మాన్‌బాగ్‌లతో పాటు బొందలగూడ ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు జెండాలు పట్టుకుని బస్తీల్లో తిరుగుతూ పతంగ్ గుర్తుకు ఓటు వేసి ఒవైసీని గెలిపించాలని నినాదాలు చేశారు. మజ్లిస్ కు విజయం చేకూర్చాలని హ్యాండ్ మైక్ పట్టుకుని అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. పోలింగ్‌రోజున టీవీలు చూస్తూ ఇళ్లకే పరిమితం కాకుండా బూత్‌లకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వలస వెళ్లిన భారతీయులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మల్కాజిగిరి.. ‘హస్తం’ గురి! పైచేయి కోసం కసరత్తు