Share News

శంషాబాద్‌లో 3 విమానాలకు బెదిరింపులు

ABN , Publish Date - Nov 04 , 2024 | 03:16 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతూనే ఉంది.

శంషాబాద్‌లో 3 విమానాలకు  బెదిరింపులు

శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం మూడు ఇండిగో విమానాలు, ఒక ఎయిర్‌ ఇండియా విమానంలో బాంబులు ఉన్నట్లు ఆగంతుకులు బెదిరింపు మెయిల్స్‌ చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి పుణె వెళ్తున్న విమానానికి, బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానానికి, హైదరాబాద్‌ నుంచి గోవా వెళ్తున్న విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. మరోవైపు, గోవా నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు మెయిల్‌ రావడంతో విమానాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. భద్రతా సిబ్బంది బాంబు, డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబులు లేవని తేల్చారు.

Updated Date - Nov 04 , 2024 | 03:16 AM